twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుక్ మెడకు ఐటీ ఉచ్చు.. బాద్షా భాగోతాన్ని బయటపెట్టిన గూగుల్

    By Rajababu
    |

    బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్ మెడకు ఐటీ ఉచ్చు బిగుసుకొంటున్నది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి కొనుగోలు చేశాడనే ఆరోపణలపై ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గతంలో షారుక్ వద్ద పనిచేసిన చార్టెడ్ అకౌంటెంట్‌ మోరేశ్వర్ అజగావోంకర్ స్టేట్‌మెంట్‌ను ఐటీ అధికారులు సేకరించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.

    భూముల కొనుగోలు

    భూముల కొనుగోలు

    అలీబాగ్‌లో భూములు కోనుగోలు అంశం వివాదంగా మారింది. వ్యవసాయం కోసం కొనుగోలు చేసిన భూములను కమర్షియల్ కోసం వాడుకొన్నట్టు స్పష్టమైంది. ఆ భూముల్లో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకోవడం నిబంధనల ఉల్లంఘన జరిగింది అని ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు.

    నిబంధనలు తుంగలోకి

    నిబంధనలు తుంగలోకి

    వ్యవసాయ క్షేత్రంలో సుమారు 20 వేల చదరపు అడుగుల మేర బంగళాను నిర్మించారు. అంతేకాకుండా హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా చేపట్టినట్టు గూగుల్ ఎర్త్ శాటిలైట్ ద్వారా అధికారుల ఫొటో ఆధారాలు సేకరించారు.

    16 కోట్లు కాదు.. 50 కోట్లు

    16 కోట్లు కాదు.. 50 కోట్లు

    విలాసవంతమైన బంగళాను కేవలం రూ.16 కోట్లతో నిర్మించినట్టు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. అయితే బంగళాను రూ.50 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించినట్టు ఐటీ అధికారులు వ్యాల్యూయేషన్ వేయడం గమనార్హం.

    షారుక్ ఆదేశాల మేరకే

    షారుక్ ఆదేశాల మేరకే

    ఫొర్జరీ డాక్యుమెంట్లను సమర్పించి ఐటీ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఇటీవల చార్టెట్ అకౌంటెంట్‌ను విచారించారు. షారుక్ ఆదేశాల మేరకే తాను డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశాను అని విచారణలో చెప్పినట్టు అధికారులు వెల్లడించారు.

    షారుఖ్ బంగళా అటాచ్

    షారుఖ్ బంగళా అటాచ్

    ఐటీ చట్టం నిబంధనలు ఉల్లంఘన కేసులో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. గత డిసెంబర్‌లో షారుక్ ఖాన్ బంగళాను అటాచ్ చేశారు. తాజాగా చార్టెట్ అకౌంట్‌ను విచారించడంతో అతడు చేతులెత్తేయడంతో షారుక్ ఇబ్బందుల్లో పడినట్లయింది.

    English summary
    Bollywood badshah and a millionaire many times over, Shah Rukh Khan is in trouble over allegations that he used forged documents to buy land. The other forged documents include a record of rights that show the existence of a bungalow from pre-1991. In fact photographs from Google Earth Satellite Photograph for the year 2003 show no such bungalow.The department had provisionally attached the superstar's bungalow in December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X