Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌గా కేక పెట్టించిన టైగర్ .. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్
ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ దర్శకత్వంలో 2012లో విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకు సీక్వెల్‌గా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మే 12న రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ హీరోగా, అనన్య పాండే, తారా సుతారియా హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు సినీ ప్రేక్షకుల్లో జోష్‌ను పెంచుతున్నాయి. సూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా అలియాభట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ మల్హోత్రా బాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా ట్రైలర్లో మూడు ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. మరో ట్రైలర్‌ను విడుదల చేసి మిగితా నటీనటుల వివరాలను తెలియజేస్తారు. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ క్రేజీ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తారు. అన్యన్య, తారాతో రొమాన్స్ కూడా చేస్తారు అనే విషయాన్ని బాలీవుడ్ పత్రికలు వెల్లడిస్తున్నాయి. ట్రైలర్లో యూత్‌కు నచ్చిన క్రీడా అంశాలు విపరీతంగా ఉన్నాయి. యాక్షన్ సీన్లు చాలా కొత్తగా ఉన్నాయి.
ఈచిత్రంలో ఆదిత్య సీల్, హలీవుడ్ నటుడు విల్ స్మిత్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం 2019 మే 10న రిలీజ్ కానున్నది.