Don't Miss!
- Lifestyle
పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే.. రాత్రయినా, పగలైనా 'పడక' పని సాఫీగా సాగుతుంది
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Suhana Khan: రెడ్ డ్రెస్ లో షారుక్ కూతురు అందాల ఆరబోత.. మొదటి సినిమాకే ఇలా ఉందంటే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ వారసులకు ఏ స్థాయిలో క్రేజ్ అందుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వారికి క్రేజ్ తో పాటు కొంత ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక షారుక్ ఖాన్ కూతురు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రీసెంట్ గా సుహానా ఖాన్ గ్లామర్ డోస్ తో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక మొదటి సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఘాటైన పోజులతో..
షారుక్ ఖాన్ కూతురు సినిమా ఇండస్ట్రీలోకి రాదు అని మొదట అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ఆమె సోషల్ మీడియాలో హడావిడిగా కనిపించిన తర్వాత తప్పకుండా గ్లామరస్ బ్యూటీగా ఎంట్రీ ఇస్తుంది అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. సుహానా ఖాన్ లేటెస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ కు తగ్గట్టుగా స్పెషల్ ఫోటోషూట్స్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమె విబిన్నమైన తరహాలో ఘాటైన పోజులతో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వస్తోంది.

సినిమాల కోసం రెడీగా..
షారుఖాన్ కూతురిగా కాకుండా సుహానా ఖాన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలని అనుకుంటుంది. ఇక ఆమె మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. విదేశీ ఫిలిం కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని పూర్తిస్థాయిలో కోర్సులు పూర్తి చేసిన తర్వాతనే ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఆమె ఇప్పుడు సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది.

షారుక్ రియాక్షన్
అయితే సుహానా ఖాన్ సినిమా కెరీర్ విషయంలో మాత్రం షారుఖాన్ ఇంతవరకు పెద్దగా స్పందించింది లేదు. కానీ ఆమెకు నచ్చినట్లుగా కెరీర్ ను సెట్ చేసుకుంటే తనకు ఏమీ అభ్యంతరం లేదు అని కూడా అతను గత ఇంటర్వ్యూలలో తెలియజేశాడు. ఒక విధంగా తన కాళ్ళ మీద తను నిలబడినా తనకు ఇంకా గర్వంగా ఉంటుంది అని షారుక్ ధీమా వ్యక్తం చేశాడు.

రెడ్ డ్రెస్ లో..
ఇక సుహానా ఖాన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె బాలీవుడ్ సినీ ప్రముఖులతో కలిసి గత రాత్రి ఒక పార్టీలో పాల్గొన్నారు. ఇక సుహానా ఖాన్ మొదటిసారి రెడ్ డ్రెస్ లో ఘాటైన స్టిల్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. తన మొదటి సినిమా చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి సుహానా ఖాన్ ఆ పార్టీలో పాల్గొన్నారు.
|
మొదటి సినిమాలోనే ఘాటైన రోల్
సుహానా ఖాన్ నటించిన ది ఆర్చిస్ అనే మొదటి సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఒక పార్టీ చేసుకున్నారు. ఇక పార్టీలో సినిమాలో నటించిన సుహానాతో పాటు జాన్వి కపూర్ సోదరి ఖుషి కపూర్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ పార్టీలో వారు ఇద్దరు కూడా ఘాటైన స్టిల్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక మొదటి సినిమాలో హీరోయిన్ గ్లామర్ తో హీటెక్కించబోతున్నట్లు అర్థమవుతుంది. మరి రెండవ సినిమాతో సుహానా ఖాన్ ఇంకా ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలి.