వాళ్లేమైనా డైపర్లు మారుస్తారా? ఘాటుగా స్పందించిన సన్నీ లియోన్
పోర్న్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన సన్నీ లియోన్ ఆ తర్వాత బిగ్‌బాస్ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. తన అందచందాలతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది. హిందీ చిత్ర సీమలోనే కాదు.. పలు దక్షిణాది భాషల సినిమాల్లో కూడా ఐటెమ్ సాంగ్స్‌లో నర్తించింది. శృంగార తారగానే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ నటిగా కూడా తాను మెప్పించగలనని అంటోంది. అయితే ప్రేక్షకులు తన నుంచి సెక్సీనెస్ మాత్రమే కోరుకుంటున్నారని, అందుకే అలాంటి పాత్రల్లోనే కనిపిస్తున్నానని చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ చెప్పిన విషయాలు ఏమిటంటే?

ప్రేక్షకులు నా నుంచి కోరుకునేది అదే..
`నా వద్దకు వచ్చే వారందరూ హాట్ రోల్స్, ఐటెం సాంగ్స్ కోసమే వస్తారు. తెరపై అందాల ప్రదర్శన చేయాలని అడుగుతుంటారు. వారలా అడగటం నాకేం ఇబ్బంది కాదు. ప్రేక్షకుల అభిరుచి మేరకే దర్శక నిర్మాతలు సినిమాలు తీస్తారు. ప్రేక్షకులు నన్ను శృంగార తారగానే చూస్తున్నారు. నా సినిమాలు సెక్సీగా, సెన్సువల్‌గా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కాబట్టి నాకు అలాంటి పాత్రలే వస్తున్నాయి. నేను అవే చెయాల్సి వస్తోంది అని సన్నీ పేర్కొంది.

నాకేం అభ్యంతరం లేదు
`ప్రేక్షకులు నన్ను శృంగార తారగానే చూడడం నాకేం ఇబ్బంది కాదు. నేను వారిని గౌరవిస్తాను. నా మొదటి సినిమా నుంచి ఎంతో మంది నన్ను అభిమానిస్తున్నారు. నన్ను నన్నుగా ఆమోదించారు. ఒక నటిగా అన్ని రకాల పాత్రలూ చేయాలని నాకు ఉంటుంది. కానీ, ఆ అవకాశం ఎప్పుడో దొరుకుతుంది. మన ఇష్టాయిష్టాల కోసం నిర్మాతల డబ్బులను రిస్క్‌లో పెట్టకూడదు. తెరపై అందాల ప్రదర్శన చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. పాత్రను బట్టి ఎలా నటించాలో నాకు ఓ క్లారిటీ ఉంటుంద`ని సన్నీ చెప్పుకొచ్చింది.

సరోగసీ విధానం ద్వారా పిల్లలు
వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న సన్నీ లియోన్ సరోగసీ విధానం ద్వారా తల్లి అయింది. అద్దె గర్భం ద్వారా సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ తల్లిదండ్రులయ్యారు. వీరికి అషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్ అని పేర్లు పెట్టారు. అంతకు ముందు ఒక పాపను సన్నీ దత్తత తీసుకుంది. ఆ చిన్నారికి నిషా కౌర్ వెబర్ అని నామకరణం చేసింది. వీరికి సంబంధించిన ఫొటోలను సన్నీ లియోన్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటుంది.

విష్ణు సినిమాతో తెలుగులోకి రీ-ఎంట్రీ
మంచు మనోజ్ నటించిన `కరెంట్ తీగ` సినిమాతో సన్నీ లియోన్ తెలుగు తెరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఐటెం సాంగ్ మాత్రమే కాకుండా కొన్ని సన్నివేశాల్లో కూడా నటించింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్‌లు చేసి మెప్పించింది. ఇక, త్వరలో మంచు విష్ణు హీరోగా నటించనున్న `గాలి నాగేశ్వరరావు` సినిమాలో ఓ హీరోయిన్ పాత్రను సన్నీ దక్కించుకుందట. ఆ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో కథానాయిక పాత్రలో సన్నీ మెరవనుందట. ఇషాన్ సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Recommended Video

హాట్ ఫొటోలపై ట్రోలింగ్..
సోషల్ మీడియాలో తరచుగా హాట్ ఫొటోలు షేర్ చేసే సన్నీ లియోన్‌కు నెటిజన్ల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తుంటాయి. కొందరు సన్నీ హాట్ ఫొటోలను మెచ్చుకుంటూ కామెంట్లు చేసినా.. మెజారిటీ నెటిజన్లు మాత్రం ట్రోలింగ్‌కు పాల్పడుతుంటారు. తనపై జరిగే ట్రోలింగ్ గురించి సన్నీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. `ట్రోలర్స్‌కు ఎందుకు సమాధానం చెప్పాలి. మనల్ని తిట్టడం ద్వారా వారు పాపులర్ అవుదాం అనుకుంటారు. వాళ్లు కనీసం నా పిల్లలకు డైపర్లు మార్చడానికి కూడా సహాయం చేయరు. వారు నా కుటుంబం, స్నేహితులు కాదు. వారిని పట్టించుకోవడం ఎందుక`ని సన్నీ ప్రశ్నించింది.


Click it and Unblock the Notifications











