బ్రేకింగ్: Sushant Singh Rajput death case: హైదరాబాద్‌లో సిద్దార్థ్ పితాని అరెస్ట్.. సంచలన రీతిలో ముంబైకి!
బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో సంచలన అరెస్ట్ జరిగింది. సుశాంత్ మరణం కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి స్నేహితుడు సిద్దార్థ్ పితానిని ముంబైకి చెందిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్‌లోని రాచకొండ విభాగం పోలీసులు ధృవీకరించారు.
Recommended Video

జూన్ 14వ తేదీకి ముందు ఏం జరిగిందని..
సుశాంత్ మరణంపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. సుశాంత్ ఇంటిలో ఉన్న వారిని నిశితంగా ప్రశ్నించారు. జూన్ 14వ తేదీ రాత్రి, ఆ ముందు రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను అధికారులు సేకరించారు. ఈ క్రమంలోనే సుశాంత్‌తో ఇంటిలో దాదాపు ఏడాది కాలంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ్ పితానిపై పోలీసులు దృష్టిపెట్టారు.

వెలుగులోకి డ్రగ్స్ కోణం..
సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. సుశాంత్ ఇంటిలో ఉన్న ఫ్రెండ్స్ అతడికి డ్రగ్స్ సరఫరా చేశారనే విషయంపై పలువురిని విచారించారు. ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మాజీ మేనేజర్ దిశా సలియాన్ అనుమానాస్పద మరణాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం సిద్ధార్థ్ పితానికి తెలిసి ఉంటుందనే కోణంలో విచారణకు సిద్ధమయ్యారు.

సిద్దార్థ్ పితాని విచారించిన బీహార్ పోలీసులు
సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలకంగా మారిన సిద్ధార్థ్‌ను వ్యక్తిగతంగా కలుసుకోవడంలో విఫలమైన బీహార్ పోలీసులు గతంలో ఫోన్ ద్వారా ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఫోన్‌లో పలు ప్రశ్నలను సంధించిన అవసరమైన సమాచారాన్ని రికార్టు చేసినట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేయడం బాలీవుడ్‌లో మరింత చర్చనీయాంశమైంది.

హైదరాబాద్‌లో సిద్దార్థ్ పితాని అరెస్ట్
ప్రస్తుతం అనేక మలుపు తిరుగుతున్న సుశాంత్ కేసులో సిద్దార్థ్ పితానిని అరెస్ట్ చేయడం మరింత సంచలన రేపింది. ముంబైలో పరిస్థితులు దారుణంగా మారడంతో సిద్ధార్థ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. దర్యాప్తును మరోసారి వేగవంతం చేసిన నార్కోటిక్ కంట్రోల్ అధికారులు శుక్రవారం మే 28వ తేదీ ఉదయం సిద్దార్థ్‌ను అరెస్ట్ చేశారు.

మే 7వ తేదీన కీలక వ్యక్తుల అరెస్ట్
సిద్దార్త్ పితాని అరెస్ట్‌కు ముందు మే 7వ తేదీన సుశాంత్ రాజ్‌పుత్ మరణంతో కనెక్షన్ ఉన్న హేమంత్ షా అలియాస్ మహారాజ్‌ను అరెస్ట్ చేశారు. ముంబైలో కొందరికి డ్రగ్స్ సప్లయి చేశారనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పితాని అరెస్ట్ జరిగిందనే విషయం బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











