Just In
- 4 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 5 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుశాంత్ మరణానికి ఐదు రోజుల ముందు.. సంచలన విషయాన్ని బయటపెట్టిన స్నేహితుడు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు జరిగిన విషయాలను ఆయన స్నేహితుడు సిద్ధార్థ్ గుప్తా సంచలన రీతిలో వెల్లడించారు. సుశాంత్ ఆలోచనలు, ఆచరణలు, ఆయనతో ఉన్న అనుబంధం గురించిన పలు విషయాలను వెల్లడించారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందర్భంగా...

సుశాంత్ సింగ్‌లో గొప్ప లక్షణాలు
సుశాంత్‌లో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను సమానంగా తీసుకొంటాడు. ఆయనలో మానసిక పరిణితి చాలా ఉంది. ఎప్పుడూ కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తుంటాడు అని సిద్ధార్థ్ గుప్తా పేర్కొన్నాడు.

ఆలోచనలు గొప్పగా..
సుశాంత్‌కు స్నేహితుడు కావడం గర్వంగా ఉంటుంది. సుశాంత్ ఆలోచనలు గొప్పగా ఉంటాయి. కానీ ఆయనను అందరూ తప్పుగా అర్థం చేసుకొన్నారు. తనకు ప్రేమను పంచిన ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఉండేవారు అని సిద్ధార్థ్ గుప్తా పేర్కొన్నారు.

ఆధ్యాత్మిక చింతనకు లోనైనట్టు
సుశాంత్ తన మరణానికి ఐదు రోజుల ముందు నాకు, మరో స్నేహితుడికి ఓ సందేశం పంపాడు. తాను ఆధ్యాత్మిక చింతనకు గురయ్యాను. ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నట్టు తనకు, మరో స్నేహితుడు కౌశల్‌కు మెసేజ్ పంపాడు అని సిద్ధార్థ్ గుప్తా తెలిపారు.

సుశాంత్ సింగ్ జీవితంలో ఏదో అంటూ
సుశాంత్ సింగ్ సందేశం పంపిన తర్వాత తాను, కౌశల్ ఆ విషయంపై చర్చించాం. సుశాంత్ జీవితంలో ఏదో జరుగుతున్నదనే భావన కలిగింది. అయితే త్వరలోనే ఆయనను కలుస్తామని చెప్పాం. అయితే తన వద్ద సుశాంత్ నెంబర్ లేకపోవడం వల్ల ఆయనను కలుసుకోలేకపోయాం అని సిద్ధార్థ్ వెల్లడించారు.

జూన్ 14వ తేదీన సూసైడ్‌తో
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనూహ్య పరిస్థితుల్లో జూన్ 14వ తేదీన ఆత్మహత్య చేసుకొని మరణించడం ప్రపంపవ్యాప్తంగా సినీ అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఆయన మరణంపై సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ క్రమంలో నార్కోటిక్స్కంట్రోల్ బ్యూరో కూడా రంగలోకి దూకి పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.