twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sushant Singh Rajput ది హత్యే.. మళ్లీ సీబీఐకి కేసు.. పారదర్శకంగా దర్యాప్తు చేయాలి అంటూ సుశాంత్ సోదరి డిమాండ్

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మరోసారి జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలోని కూపర్ హాస్పిటల్‌లో సుశాంత్‌ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన ఉద్యోగి రూప్ కుమార్ షా చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం లేపాయి. అయితే సుశాంత్ సింగ్ మరణం సూసైడ్ కాదు. ఆయన హత్యే అంటూ చెప్పిన విషయంపై భారీ చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కృతి స్పందించారు. రూప్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ..

    కూపర్ హాస్పిటల్‌లో పోస్టుమార్టం

    కూపర్ హాస్పిటల్‌లో పోస్టుమార్టం


    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 2020లో అనుమానాస్పద పరిస్థితుల్లో బంద్రాలోని తన నివాసంలో మరణించారు. ఆయన మృతదేహానికి కూపర్ హాస్పిటల్‌లో పోస్టు మార్టం నిర్వహించారు. ఆ ప్రక్రియను అక్కడి ఉద్యోగి రూప్‌కుమార్ షా పర్యవేక్షించారు. అయితే ఆ సమయంలో సుశాంత్ ఒంటిపై ఉన్న గాయాలను చూసిన తర్వాత అతడిది సూసైడ్ కాదని అనిపించింది. ఆ సమయంలో ఉన్న పరిస్థితులు, ప్రాణహాని ఉంటుందన్న ఉద్దేశంతో తాను ఈ విషయాన్ని వెల్లడించలేదు అని చెప్పారు.

     రిటైర్మెంట్ తర్వాత సంచలన వ్యాఖ్యలు

    రిటైర్మెంట్ తర్వాత సంచలన వ్యాఖ్యలు

    ఇక కూపర్ హాస్పిటల్ నుంచి రిటైర్ అయిన రూప్ కుమార్ షా ఇటీవల సుశాంత్ మరణం సూసైడ్ కాదని మీడియాకు వెల్లడించారు. అతడి మెడపై ఉన్న గాయాలు, దేహంలో విరిగిన ఎముకలను బట్టి చూస్తే.. అతడు ఉరి వేసుకొని మరణించే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. సుశాంత్‌ది ముమ్మాటికి హత్యే అని ఆయన అన్నారు.

    సుశాంత్ సింగ్‌ను హత్యే చేశారు

    సుశాంత్ సింగ్‌ను హత్యే చేశారు


    అయితే రూప్‌కుమార్ వ్యాఖ్యలు దూమరం రేపుతున్న నేపథ్యంలో సుశాంత్ సోదరి కృతి ఘాటుగా స్పందించింది. తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను హత్య చేశారు. పోస్ట్ మార్టం చేసిన ఉద్యోగి చెప్పిన విషయం షాకింగ్‌గా ఉంది. ఆయన వాగ్మూలాన్ని సాక్ష్యంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అని శ్వేతా సింగ్ కృతి అభిప్రాయపడ్డారు.

    సీబీఐ విచారణపై మాకు గౌరవం

    సీబీఐ విచారణపై మాకు గౌరవం


    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదని రూప్ కుమార్ షా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలి. ఈ వ్యవహారంలో సీబీఐ ఉన్నతస్థాయి విచారణ, దర్యాప్తు చేపట్టాలి. సీబీఐ అంటే మాకు అత్యున్నత గౌరవం ఉంది. నా సోదరుడి మరణం విషయంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తారని భావిస్తున్నాను. మా సోదరుడి మరణంతో మా గుండె ఇంకా ద్రవిస్తూనే ఉంది అని ఆమె అన్నారు.

    జూన్ 14వ తేదీన ఏం జరిగిందంటే?

    జూన్ 14వ తేదీన ఏం జరిగిందంటే?


    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన మరణించిన తర్వాత అతడిని కూపర్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలోనేను ఆయన మృతదేహాన్ని చూశాను. గొంతు మీద బలంగా నొక్కితే ఎలాంటి గాయాలు, మరకలు ఉంటాయో అవి కనిపించాయి. ఆయన శరీరంలో ఎముకలు విరిగి ఉన్నాయి నాకు పోస్టుమార్టం చేసే సేవలో 28 ఏళ్ల అనుభవం ఉంది. నాకు ఆ బాడీని చూడగానే ఆయనది హత్యే అనిపించింది అని రూప్ కుమార్ షా రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించాడు.

    English summary
    Bollywood Actor Sushanth Singh Rajput's death not suicide, Its murder: Mortuary Attendant's sensational Revelation goes viral. He said, I will still say, after seeing the photos, anybody will say it's a murder, not suicide. In this occassion, BJP accussed that, AU Called 44 times to Rhea Chakraborthy during the SSR' investigation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X