‘మాజీ సీఎం భార్య అంటే నాకు మోజు.. ఆడ, మగతో అలా శృంగారం’
ఇటీవల అమ్మాయిలంటేనే నాకు క్రష్ అంటూ హీరోయిన్ గాయత్రీ గుప్తా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి తనకు అమ్మాయిలంటే పిచ్చి అని కానీ దానిని ఎలా బయటపెట్టాలో తెలియదని గాయత్రి చెప్పింది. ఓ వయసుకు వచ్చాకే సెక్సువల్ ఇంపార్టెన్స్ గురించి తెలిసిందని ఆమె వ్యాఖ్యానించి దుమారం రేపింది. తాజాగా గాయత్రీ గుప్తా బాటలోనే మరో హీరోయిన్ .. తనకు అమ్మాయిలంటేనే పిచ్చి అంటూ బాంబు పేల్చింది. ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు అలాంటి కామెంట్స్ చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..
వివాదాలతో ఫేమస్
స్వర భాస్కర్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అందంతో పాటు అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతో కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు స్వర భాస్కర్. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ.. గుజారీష్, తను వెడ్స్ మెను, చిల్లర్ పార్టీ, రంజనా, ప్రేమ్ రతన్ దాన్ పాయో, అనార్కలి ఆఫ్ ఆరా, వీరే ది వెడ్డింగ్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రెండేళ్ల క్రితం ముంబైకి చెందిన రాజకీయ నాయకుడు ఫహద్ అహ్మద్‌ను పెళ్లాడారు స్వర భాస్కర్. ముంబై రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి పెళ్లి జరిగింది. ఫహద్.. సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర యువజన విభాగంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఫస్ట్ నైట్ ఫోటోలు షేర్ చేసి
పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన స్వర బాంబు పేల్చింది. హనీమూన్ బెడ్‌ను గులాబీలతో అలంకరించిందని స్వర ఆ ఫోటోలలో పేర్కొంది. ఇటీవల తన భర్తపై వచ్చిన కుల వివక్ష వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిలబడింది. అలాగే మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా వచ్చిన ఛావా సినిమాపైనా స్వర భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహాకుంభ్ మేళాలో జరిగిన తొక్కిసలాట కంటే 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లుగా వచ్చిన కల్పిత సినిమాలనే జనం ఆదరిస్తున్నారని ఆమె పోస్ట్ పెట్టారు. ఛావాలో చూపించిన విధంగా శంభాజీని ఔరంగజేబు చిత్ర హింసలు పెట్టి చంపలేదన్నట్లుగా స్వర భాస్కర్ వ్యాఖ్యానించడంపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది.
అంతా బై సెక్సువల్సే
దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో స్వర భాస్కర్ వెనక్కి తగ్గారు. ప్రజలను ఏకం చేయడానికి చారిత్ర అంశాలను ఉపయోగించాలి కానీ ప్రజలను విభజించి, సమస్యల నుంచి పక్కకి మళ్లించడానికి కాదని స్వర భాస్కర్ పోస్ట్ పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భర్త ఫహద్‌తో కలిసి హాజరైన ఆమె మరో దుమారం రేపారు. ప్రతి మనిషి బైసెక్సువలేనని.. ప్రతి ఒక్కరూ అబ్బాయికి, అమ్మాయికి ఆకర్షితులవుతారని స్వర భాస్కర్ వ్యాఖ్యానించింది. సమాజంలో ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగా ఉండనిస్తే.. ఆడ, మగ అందరూ బై సెక్సువలేనని అభిప్రాయపడింది.
ఆమె అంటే క్రష్
తనకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భార్య డింపుల్ యాదవ్ అంటే క్రష్ అని పేర్కొంది. ఇటీవలే ఆమెను ఓసారి కలిశానని స్వర భాస్కర్ చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. నీ మాటల వల్ల నీ భర్తను చూస్తుంటే జాలిగా ఉందంటూ దుయ్యబడుతున్నారు. మరి దీనిపై డింపుల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











