ఆఫర్ ఇస్తానని చెప్పి పలుమార్లు అత్యాచారం.. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ అధినేతపై రేప్ కేసు!

దేశంలోనే అతిపెద్ద మ్యూజిక్ కంపెనీ టీ సీరీస్ అధినేత భూషన్ కుమార్‌పై రేప్ కేసు నమోదైంది. ఓ సినిమాలో తనకు అవకాశం ఇస్తానని మోసం చేశాడు. తన ఇష్టానికి వ్యతిరేకంగా అత్యాచారం జరిపారు అని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తనపై కేసు నమోదు కావడంపై టీ సిరీస్ వర్గాలు స్పందిస్తూ.. తమపై తప్పుడు కేసు, ఆరోపణలు చేశారు అని ఖండించారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. .

టీ సిరీస్ ఎండీ భూషణ్ కుమార్‌పై

టీ సిరీస్ ఎండీ భూషణ్ కుమార్‌పై

టీ సీరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్‌పై రేప్ కేసు నమోదైంది. 30 ఏళ్ల యువతి డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కంపెనీలోని ఓ ప్రాజెక్టులో అవకాశాలు కల్పిస్తానని చెప్పి తనను వాడుకొన్నారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు అని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

భూషణ్ కుమార్‌పై పెట్టిన సెక్షన్లు ఇవే...

భూషణ్ కుమార్‌పై పెట్టిన సెక్షన్లు ఇవే...


తనకు సినిమా ఆఫర్లు ఇస్తానని ఆశచూపి తనపై అత్యాచారం జరిపారు. 2017 నుంచి 2020 వరకు పలు మార్లు భూషణ్ కుమార్ రేప్‌కు పాల్పడ్డారు. తనను దారుణంగా వాడుకొని వదిలేశారు. సినిమా ఆఫర్లు ఇవ్వకుండా మోసం చేశారు అని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఈ కేసులో భూషణ్ కుమార్‌పై ఐపీసీ 376, 420, 506 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు.

నాపై తప్పుడు ఆరోపణలు అంటూ

నాపై తప్పుడు ఆరోపణలు అంటూ


అయితే తనపై రిజిస్టర్ అయిన కేసు గురించి టీ సిరీస్ వర్గాలు స్పందించాయి. భూషణ్ కుమార్‌పై పెట్టిన కేసులో వాస్తవం లేదు. అవన్నీ తప్పుడు ఆరోపణలు. ఓ వెబ్ సిరీస్‌కు ఫండింగ్ చేయమని ఓ మహిళా నిర్మాత వచ్చింది. ఆమె ప్రపోజల్‌ను తిరస్కరించడంతో ఇలా దురుద్దేశంగా తమపై కేసు పెట్టారని ఓ ప్రకటనలో తెలిపారు.

గతంలో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు

గతంలో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు


భూషణ్ కుమార్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2018లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగిన సమయంలో భూషణ్ కుమార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం అప్పట్లో సంచలనం రేపాయి. ఓ గుర్తు తెలియని మహిళ ట్విట్టర్‌లో ట్వీట్ చేసి భూషణ్ కుమార్‌పై ఆరోపణలు చేశారు. ఆయనతో పడుకోవడానికి తిరస్కరించినందున తనను సినిమా నుంచి తీసేశారు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

గుల్షన్ కుమార్ హత్య తర్వాత

గుల్షన్ కుమార్ హత్య తర్వాత


దివంగత, ప్రముఖ నిర్మాత గుల్షన్ కుమార్‌ను గ్యాంగ్‌స్టర్లు కాల్చి చంపిన తర్వాత టీ సిరీస్‌కు భూషణ్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 1997 నుంచి కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ రంగంలో 90 శాతం బిజినెస్‌ను టీసీరీస్ నియంత్రిస్తున్నది. రాధే శ్యామ్,, భుజ్ చిత్రాలను నిర్మించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X