హీరోయిన్‌తో విజయ్ వర్మ ఎఫైర్? ఎవడు ఎవరితో తిరిగితే నాకేంటీ... తేల్చేసిన తమన్నా
మిల్కీబ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కొంతకాలం పాటు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. రేపో మాపో పెళ్లి చేసుకుంటారని అంతా అనుకుంటున్న సమయంలో ఈ జంట విడిపోవడం ఇండస్ట్రీని, అభిమానులను షాక్‌కు గురిచేసింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలకు కారణం ఏంటీ? అనే దానిపై చిత్ర పరిశ్రమలో నిత్యం ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉంది. మరోవైపు.. తమన్నాతో బ్రేకప్ తర్వాత దంగల్ ఫేమ్, నటి ఫాతిమా సనా షేక్‌తో విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్నారన్న గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై తమన్నా భాటియా స్పందించారు.
ప్రేమలో పడిన తమన్నా, విజయ్ వర్మ
లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో తమన్నా, విజయ్ వర్మలు కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి వెకేషన్స్‌కు హాజరుకావడం, చెట్టాపట్టాలేసుకుని తిరుతుండటంతో మీడియాకు డౌట్ కొట్టింది. దాంతో తమన్నా, విజయ్ వర్మ మధ్య ఏదో జరుగుతోందని మీడియా కోడై కూసింది. వీటికి తెరదించుతూ తమన్నా, విజయ్‌లు బహిరంగంగానే తమ రిలేషన్‌ను బయటపెట్టారు. తమ బంధం ప్రపంచానికి తెలియడంతో వీరిద్దరూ పబ్లిక్‌గా తిరగడం మొదలుపెట్టారు.

బ్రేకప్‌తో షాకిచ్చిన తమన్నా - విజయ్
ఈ ఏడాది ఇద్దరూ ఖచ్చితంగా గుడ్ న్యూస్ చెబుతారని అంతా భావిస్తుండగా.. తమన్నా, విజయ్‌లు విడిపోయారు. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలని తమన్నా నిర్ణయించుకోగా.. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని విజయ్ పట్టుబట్టడమే ఈ జంట విడిపోవడానికి కారణమని బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. అయితే తమన్నాతో బ్రేకప్ చెప్పిన కొద్దిరోజులకే విజయ్ వర్మ.. దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఓ రెస్టారెంట్ వద్ద విజయ్- ఫాతిమాలు క్లోజ్‌గా ఉన్న ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంతో వీరిద్దరి మధ్య యవ్వారం నడుస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు.
ఫాతిమతో విజయ్ డేటింగ్?
అయితే ఈ పుకార్లపై ఫాతిమా స్పందించారు. తమ మధ్య ఎలాంటి బంధం లేదని.. తను ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్నట్లు తేల్చేశారు. ఒకే ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేసేవారు ఒకే రెస్టారెంట్‌లో కలిసి భోజనం చేయకూడదా? అని ప్రశ్నించారు. విజయ్‌తో డేటింగ్ రూమర్స్ మధ్య తమన్నా భాటియాతో ఫాతిమ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా విజయ్ వర్మ - ఫాతిమ డేటింగ్‌పై తమన్నా భాటియా స్పందించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అతను ఎవరితో తిరిగితే నాకేంటీ?
ఫాతిమతో విజయ్ డేటింగ్ చేస్తుండటంపై మీ అభిప్రాయం ఏంటీ? అని యాంకర్ ప్రశ్నించగా.. తమన్నా స్పందించారు. విజయ్‌తో తాను విడిపోయి చాలా రోజులైందని, అలాంటి సమయంలో ఎవరు ఎవరితో తిరిగితే నాకేంటని కుండబద్ధలు కొట్టారు తమన్నా భాటియా. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలాఉండగా.. తమన్నా ప్రస్తుతం హీరోయిన్‌గా కంటే స్పెషల్ సాంగ్స్‌తోనే బిజీగా ఉన్నారు. తాజాగా తన కెరీర్‌లోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్‌లో హార్రర్ బోల్డ్ ఫ్రాంచైజీ రాగిణి ఎంఎంఎస్ సిరీస్‌లో హీరోయిన్‌గా మిల్కీబ్యూటీ నటించనున్నారని బీటౌన్ టాక్. గతంలో సన్నీలియోన్, కైనాజ్ మోతివాలాలు బోల్డ్‌గా నటించి కుర్రాళ్లలో సెగలు రేపారు. మరి తమన్నా భాటియా ఆ రేంజ్‌లో మెప్పించగలదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











