లైంగిక వేధింపులు ఇష్యూ: ఆ ఇద్దరు సూపర్ స్టార్ల మౌనంపై తనుశ్రీ దత్తా ఏమన్నారంటే?
తనుశ్రీ దత్తా, నానా పాటేకర్ ఇష్యూ రోజు రోజుకు ముదురుతోంది. పదేళ్ల క్రితం ఓ సినిమా షూటింగులో నానా పాటేకర్ తనను లైంగికంగా వేధించాడని, ఒక రాజకీయ పార్టీ గుండాలను తీసుకొచ్చి తనపై దాడి చేయించారని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆరోపించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రియాంక చోప్రా, ట్వింకిల్ ఖన్నా, స్వర భాస్కర్, పరిణీతి చోప్రా, పర్హాన్ అక్తర్ లాంటి స్టార్ తనుశ్రీ దత్తాకు మద్దతుగా మాట్లాడారు. అయితే సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారు మాత్రం ఈ ఇష్యూపై స్పందించడానికి నిరాకరించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనుశ్రీ దత్తా..... తనపై జరిగిన లైంగిక వేధింపుల ఇష్యూపై అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారు మౌనంగా ఉండటంపై రియాక్ట్ అయ్యారు. వారు ఇలా ఒక సీరియస్ ఇష్యూపై మౌనంగా ఉండటం బాధాకరం. మన దేశంలోని స్టార్లు, సూపర్ స్టార్లు మన సమాజానికి ప్రతిబింభం లాంటివారు. వారు అంతరిక్షం బయట నుండి వచ్చిన ఏలియన్స్ కాదు అని తనుశ్రీ దత్తా వ్యాఖ్యానించారు.
మన దేశంలోని ప్రజలు సినిమాలో స్టార్స్‌ను చూపించే విధానాన్ని బట్టే....నిజ జీవితంలోనూ వారు అలాగే ఉంటారు అనుకుంటారు. ఇది కాస్త నిరాశ పరిచే విషయమే... వారు యాక్టర్లు, ఎప్పుడూ యాక్ట్ చేస్తూనే ఉంటారు అని తనుశ్రీ దత్తా అన్నారు.
యాక్టర్స్ కూడా అదే సమాజం నుండి వచ్చిన వారే. కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. ఉదాహరణకు సెక్స్. దానికి గురించి మాట్లాడితే వారిని వ్యతిరేకించే వారు ఉంటారు. కొన్ని విషయాలపై మాట్లాడితే తాము ఇబ్బంది పడతామని వారు మౌనంగా ఉండిపోతారు అని దనుశ్రీ దత్తా అన్నారు.


Click it and Unblock the Notifications











