twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రెండు సినిమాల ఎఫెక్టుతో ఇండియాకి వచ్చిన విదేశీ బ్యూటీ!

    By Bojja Kumar
    |

    శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టి దాదాపు పదేళ్లయింది. తన అందం, టాలెంటుతో ఇక్కడ ఎంతో మంది అభిమానులను ఏర్పరుచుకున్న ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. కిక్, డిష్యుం, జడ్వా 2 లాంటి హిట్ చిత్రాలక్లో నటించింది. వచ్చేవారం సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ మూవీ రేస్-3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాక్వెలిన్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తాను 'కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో షారుక్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించి 'దేవ్‌దాస్‌' సినిమా చూశాను. ఆ సినిమా నాకు ఎంతలా నచ్చిందంటే ఇంటికెళ్లి డీవీడీ తెప్పించుకుని మళ్లీ మళ్లీ చూశాను. ఇందులో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, తెరకెక్కించిన విధానం ఇంప్రెస్ చేసింది. తర్వాత సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన మరో చిత్రం 'బ్లాక్‌' చూశాను. ఈ రెండు సినిమాలు చూశాక ఇండియా వచ్చి ఇక్కడి సినిమాల్లో పని చేయాలని నిర్ణయించుకున్నాను అని జాక్వెలిన్ తెలిపారు.

    Jacqueline Fernandez

    సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పని చేయాలనేది నా కల. అయతే అది ఇప్పటికీ నెరవేరలేదు. భవిష్యత్తులో నెరవేరుతుంది అని భావిస్తున్నాను అని జాక్వెలిన్ తెలిపారు. ప్రస్తుతం నా కెరీర్ నిలకడగా సాగుతోంది, ఒక్కోమెట్టు ఎక్కుతున్నాను, కెరీర్ నెమ్మదిగా సాగుతున్నా మంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి అని జాక్వెలిన్ చెప్పుకొచ్చారు. ఇది నేను చేసిన సినిమా అని చెప్పుకోవడానికి ఇష్టపడని చిత్రాలు కూడా నా కెరీర్లో ఉన్నాయి. అలాంటి సినిమాలు చేయడం ద్వారా ఎదురైన అనుభవాలతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అన్నారు.

    English summary
    Over the years, Jacqueline Fernandez has carved her own place in Bollywood with several blockbuster films like Kick, Dishoom, Judwaa 2 and others to her credit. The actress who has completed almost a decade in the Hindi film industry is currently busy with the promotions of her upcoming film Race 3 which reunites her with her 'Kick' co-star Salman Khan. Jacqueline was quoted as saying, "When I first watched Devdas at the Cannes Film Festival, I returned home, called for a DVD and watched the film again. I found the film unbelievable; all the actors looked so amazing and their performances were so wonderful."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X