Don't Miss!
- News
చంద్రబాబు కంటే నారా లోకేష్ పది ఆకులు ఎక్కువే చదివాడుగా..!!
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Tunisha Sharma వివాదాల మధ్య టెలివిజన్ నటి మృతదేహం అప్పగింత.. అంత్యక్రియలు ఎప్పుడంటే
బాలీవుడ్ నటి తునీషా శర్మ మరణం తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలీబాబా దస్తాన్ ఏ కాబూల్ షోతో పాపులారిటీ సంపాదించుకొన్న ఈ యువ నటి ఇటీవల మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో జరుగుతున్నే షూటింగ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. తన కూతురు మరణానికి కారణం మాజీ ప్రియుడు షీజాన్ ఖాన్ అని ఆరోపించారు. తునీషా శర్మ తల్లి వనితా శర్మ మీడియాతో మాట్లాడుతూ తన కూతురితో సంబంధం పెట్టుకొని.. మరొక యువతితో డేటింగ్ చేశాడు. అంతేకాకుండా మూడు, నాలుగు నెలలుగా నా కూతురిని వాడుకొన్నాడు అని ఆరోపించారు. అయితే తునీషా శర్మ తల్లి ఆరోపణలను షీజాన్ ఖాన్ ఖండించాడు. తనకు ఏ యువతితో అక్రమ సంబంధం లేదని స్పష్టం చేశారు. తన కుటుంబం, తునీషా కుటుంబం పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లే మా మధ్య బ్రేకప్ జరిగిందని చెప్పారు.
తునీషా శర్మ మరణం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు ముంబై పోలీసులు 17 స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు. తునీషా తల్లి చేసిన ఫిర్యాదు, ఆరోపణలను పరిగణనలోకి తీసుకొని విచారణను కొనసాగిస్తున్నామని మహారాష్ట్ర పోలీసు అధికారులు చెప్పారు.

ఇదిలీా ఉండగా, తునీషా శర్మ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆమె కుటుంబ సభ్యులు జేజే హాస్పిటల్‌కు వెళ్లారు. పోస్టు మార్టానికి సంబంధించిన ఫార్మాలిటీస్, డాక్యుమెంటేషన్ పూర్తి కాగానే.. హాస్పిటల్ బృందం వారి కుటుంబానికి అప్పగించారు. వాలీవ్ పోలీసులు ఆమె వాహనం వెంట వెళ్లి.. బాడీని ఇంటికి చేర్చారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మిరా రోడ్డులోని మార్చూరీలో తునీషా శర్మ బాడీని భద్రపరిచారు.
అనేక వివాదాలు, ఆరోపణల మధ్య తునీషా శర్మ అంత్యక్రియలను మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిర్వహిస్తారు అని కుటుంబ సభ్యులు చెప్పారు.