Don't Miss!
- Sports
సెంచరీ చేసినా శుభ్‌మన్ గిల్‌తో టీమిండియాకు ప్రమాదమే!
- News
ఉపాది హామీ పథకానికి తూట్లు పొడిచిన కేంద్రం.!మరోసారి మండిపడ్డ కల్వకుంట్ల కవిత.!
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Tunisha Sharma death నా కూతురితో సహజీవనం.. మరొకరితో అక్రమ సంబంధం.. మూడు నెలలు దారుణంగా!
బాలీవుడ్ నటి తునీషా శర్మ మరణం తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలీబాబా దస్తాన్ ఏ కాబూల్ షోతో పాపులారిటీ సంపాదించుకొన్న ఈ యువ నటి ఇటీవల మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో జరుగుతున్నే షూటింగ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది.
తన కూతురు మరణానికి కారణం మాజీ ప్రియుడు షీజాన్ ఖాన్ అని ఆరోపించారు. తునీషా శర్మ తల్లి వనితా శర్మ మీడియాతో మాట్లాడుతూ సంచలనం విషయాలను వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

నా కూతురు మరణానికి కారణం
తన కూతురు తునీషా శర్మ మరణం తర్వాత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. షీజాన్, తునీషా ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 15 రోజుల క్రితం వారిద్దరూ విడిపోయారు. ఆ బ్రేకప్ కారణంగానే తునీషా అప్‌సెట్ అయింది. ఆ కారణంగానే నా కూతురు తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది అని తల్లి వనిత ఆరోపించారు.

పెళ్లి చేసుకొంటానని మాటిచ్చి మోసం
తునీషాతో అఫైర్ మొదలైనప్పుడు పెళ్లి చేసుకొంటానని మాటిచ్చాడు. అయితే నా కూతురితో డేటింగ్‌కు ముందే మరో అమ్మాయితో అఫైర్ పెట్టుకొన్నాడు. తునీషాతో బంధం పెట్టుకొని మరో అమ్మాయితో రిలేషన్‌షిప్‌ను కొనసాగించాడు. నా కూతురిని మూడు, నాలుగు నెలలు దారుణంగా వాడుకొన్నాడు. శారీరకంగా ఉపయోగించుకొని.. మానసికంగా వేధించాడు అని వనిత ఆరోపించింది.

షీజాన్‌ను కఠినంగా శిక్షించాలి
నా కూతురు మరణానికి కారణం షీజాన్ ఖాన్ మాత్రమే. అమాయకురాలైన నా బిడ్డను పొట్టనపెట్టుకొన్నాడు. అతడిని కఠినంగా శిక్షించాలని కోరుకొంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అతడిని వదలకూడదు. నా కూతురును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నాను అని వనితా భోరున విలపించింది. నా కూతురు దర్యాప్తు విషయంలో మీడియా సపోర్టు చేయాలి అని ఆమె వేడుకొన్నది.

బీజేపీ మంత్రి లవ్ జిహద్ ఆరోపణలు
అయితే తల్లి వనిత సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి గిరీష్ మహాజన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తునీషా శర్మ మరణం వెనుక లవ్ జిహద్ అనే కుట్ర ఉంది. హిందూ మతానికి చెందిన అమ్మాయిలను ముస్లిం యువకులచే ఎర వేసి.. వారిని మోసగించడం ఆ తర్వాత వారిని ఇస్లాం మతంలోకి మార్పిడి చేసే కుట్ర జరుగుతున్నది అని గిరీష్ మహాజన్ అన్నారు. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం సీరియస్‌గా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

లవ్ జిహద్ వార్తలపై పోలీసులు స్పందన
తునీషా శర్మ మరణం తర్వాత వస్తున్న లవ్ జిహద్ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. మా దర్యాప్తులో అలాంటి పాయింట్ మాకు కనిపించలేదు. మేము అన్ని రకాల కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాం. విచారణ జరుగుతున్నది. షీజాన్‌ను అరెస్ట్ చేశాం. అతడి ఫోన్లను స్వాధీనం చేసుకొన్నాం. లవ్ జిహద్ లాంటి కోణం కనిపించలేదు అని ఏసీపీ చంద్రకాంత్ జాదవ్ తెలిపారు.