Don't Miss!
- News
నారా లోకేష్ పాదయాత్రకు ఊహించని ట్విస్ట్
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- Sports
INDvsNZ : ఫ్యూచర్ ఇదే.. గిల్‌ను స్టార్ అంటూ మెచ్చుకున్న విరాట్ కోహ్లీ!
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Aryan Khan విడుదలకు 25 కోట్ల లంచం.. సమీర్ వాంఖడేకు 8 కోట్లు.. నన్ను చంపేస్తారు.. సాక్షి సంచలన ఆరోపణలు
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. అక్టోబర్ 2వ తేదీన ముంబై, గోవా క్రూయిజ్‌లో రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో ముంబై నార్కోటికస్ కంట్రోల్ బ్యూర్ (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో ఓ బృందం మెరుపు దాడి చేసి ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అరెస్ట్ తర్వాత విచారణలో వెలుగు చూసిన అంశాలు, సమాచారం ఆధారంగా 20 మందికి పైగా అరెస్ట్ చేయడం జరిగింది.
అయితే అర్యన్ ఖాన్‌కు ఇప్పటికే నాలుగు సార్లు బెయిల్ పిటిషన్ తిరస్కారానికి గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ముడుపులకు డిమాండ్ చేశారనే ఆరోపణ ఇప్పుడు ఈ కేసులో సరికొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారబోతున్నది. ఆ వివారాల్లోకి వెళితే..

25 కోట్లు డిమాండ్.. 18 కోట్లకు డీల్ సెట్
ముంబై క్రూయిజ్‌లో ఎన్సీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో ముంబైకి చెందిన ప్రైవేట్ డిటెక్టివ్ గోసవి కీలక సాక్షిగా పత్రాలపై సంతకం చేశారు. ప్రైవేట్ డిటెక్టివ్ గోసామిని వెంట తీసుకొని రైడ్స్ నిర్వహించడం కూడా వివాదంగా మారింది. అయితే తాజాగా ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించకపోయిన నేపథ్యంలో గోసామి షారుక్ ఖాన్ టీమ్‌తో ముఖ్యంగా మేనేజర్ పూజ దల్దానిని కలిసి 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే 18 కోట్లకు డీల్ సెట్ అయింది అనే విషయం వెలుగులోకి వచ్చింది.

షారుక్ ఖాన్ మేనేజర్‌ను కలిశా..
ప్రైవెట్ డిటెక్టివ్, ఆర్యన్ ఖాన్ కేసులో ప్రత్యక్ష సాక్షి గోసవి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఆంగ్ల టెలివిజన్ ఛానెల్ న్యూస్ 18 ఓ కథనాన్ని ప్రసారం చేసింది. షిప్‌లో నాటకీయ ఫక్కీలో రైడ్స్ జరిగినప్పుడు నేను అక్కడ సాక్షిగా ఉన్నాను. పూజా దల్దానీని కలిశాను. 25 కోట్లు ముడుపులు డిమాండ్ చేశారు. అందులో నుంచి 8 కోట్ల రూపాయలు వాంఖేడేకు లంచం కింద ఇవ్వాల్సి ఉంటుందని ప్రత్యక్ష సాక్షి కేపీ గోసవి అనుచరుడు చెప్పారు అని న్యూస్ 18 తన కథనంలో పేర్కొన్నది.

నా ప్రాణాలకు ముప్పు..
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ప్రత్యక్ష సాక్షిని కావడం వల్ల నా ప్రాణాలకు ముప్పు ఉన్నది. సమీర్ వాంఖడే నుంచి నాకు అపాయం ఉంది. ఎన్సీబీ అధికారులు నన్ను చంపేస్తారనే భయం వెంటాడుతున్నది. ఆయన ఎన్సీబీ నుంచి ప్రాణ హానీ ఉందనే భయంతో ఉన్నాడు అని గోసవి అనుచరుడు సంచలన విషయాలను వెల్లడించారంటూ సదరు జాతీయ ఆంగ్ల టెలివిజన్ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది.

సమీర్ వాంఖడేపై ఎన్సీపీ సంచలన ఆరోపణలు
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే సంచలన ఆరోపణలు చేసిన మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసులో సమీర్ వాంఖడే భారీగా ముడుపులు అందుకొన్నారు. మాల్దీవులకు వెళ్లి సినీ తారల నుంచి భారీగా లంచాలు వసూలు చేశాడు. తాజాగా గోసవి నాకు వాట్సప్‌లో ఓ ఫోటో పంపించారు. క్రూయిజ్‌లోకి వెళ్లే సమయంలో కొందరిని గుర్తించమని అడిగారు. నాతో బలవంతంగా ఎన్సీబీ సంతకం చేయించింది. సామ్ డిసౌజా అనే వ్యక్తితో ముడుపుల గురించి గోసవి మాట్లాడారని ఎన్సీబీ నేత నవాబ్ మాలిక్ ఆరోపించారు.

ఎన్సీపీ ఆరోపణలపై బీజేపీ నేత ఖండన
ఆర్యన్ ఖాన్ కేసుకు సంబంధించి మహారాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత రామ్ కదమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో ముడుపులు తీసుకొన్న సమీర్ వాంఖడేను జైలులో పెట్టిస్తామని చెప్పడంపై రామ్ కదమ్ ఘాటుగా స్పందించారు. డ్రగ్స్ కేసు విచారణను అడ్డుకొనేందుకే ఇలాంటి విమర్శలు, ఆరోపణలను తెరపైకి తెస్తున్నారు అని రామ్ కదమ్ అన్నారు.

ఆరోపణలపై ఎన్సీబీ అభ్యంతరం
సమీర్ వాంఖడే, తమ అధికారులపై వస్తున్న ఆరోపణలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. ఈ విషయంలో సాక్షులు ఎలాంటి భయాందోళనలు లేకుండా కోర్టును అప్రోచ్ చేసుకోవచ్చు. సాక్షులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దు. అభూత కల్పనలతో మాపై ఆరోపణలు చేస్తున్నారు అని ఎన్సీబీ ఓ ప్రకటనలో తెలిపింది.
Recommended Video

అనన్య పాండేను మరోసారి ప్రశ్నించనున్న ఎన్సీబీ
ఇదిలా ఉండగా, ఆర్యన్ ఖాన్‌తో డ్రగ్స్ సరఫరా, కొనుగోలు అంశాలపై ఛాటింగ్ చేశారనే ఆరోపణలపై హీరోయిన్ అనన్య పాండేను మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే రెండుసార్లు గంటల కొద్ది విచారించిన అధికారులు సోమవారం అంటే అక్టోబర్ 25న విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. ఇలా ఈ కేసులో అనేక ట్విస్టులతో ముందుకు సాగుతున్ని.