సినిమా పరిశ్రమ నా అయ్యా జాగీరా? బికినీ క్వీన్ ఘాటైన వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు లేకపోయినా మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షించే వారిలో బోల్డ్ స్టార్ ఉర్ఫీ జావెద్ ముందుంటారు. అయితే సోషల్ మీడియాలోను, మీడియాలోను భారీ పాపులారిటీ ఉన్నప్పటికీ ఆమెను అవకాశాలు వెక్కిరిస్తున్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో ఆఫర్లు రాకపోవడంపై ఉర్ఫీ జావెద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉర్పీ వ్యాఖ్యలు మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నాయి. ఇంతకు ఈ బోల్డ్ స్టార్ ఏమన్నారంటే..

మోడలింగ్, టెలివిజన్ సీరియల్స్ ద్వారా
ఉర్ఫీ జావెద్ కెరీర్ విషయానిక వస్తే.. హిందీ టెలివిజన్ రంగంలో పలు సీరియల్స్‌లో నటించారు. బడే భయ్యాకి దుల్హానియా సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆతర్వాత చంద్ర నందిని, మేరీ దుర్గా, జీజీ మా, దయాన్, ఏ రిస్తా క్యా కహతా హై లాంటి సీరియల్స్‌లో నటించింది. అలాగే మోడల్‌గా పలు ప్రొడక్ట్స్‌లో కనిపించింది.

బిగ్‌బాస్ ఓటీటీతో పాపులారిటీ
అయితే సీరియల్ నటిగా కొనసాగుతున్న ఉర్ఫీ జావెద్‌కు బిగ్‌బాస్ ఓటీటీతో దశ తిరిగిపోయింది. బిగ్‌బాస్ ఓటీటీ షోలో చేరిన తర్వాత ఉర్ఫీ జావెద్ అంటే సినీ ప్రపంచానికి తెలిసిపోయింది. ఓటీటీలో అందాల ఆరబోత, మితిమీరిన గ్లామర్ షోతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకొన్నది. బిగ్‌బాస్ ఇంటి నుంచి బయట కాలు పెట్టేసరికి బాలీవుడ్‌లో టాప్ సెలబ్రిటీగా మారిపోయింది.

బోల్డ్‌గా, వింత వింత డ్రస్సులతో
బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ తర్వాత ఉర్పీ జావెద్ ఫ్యాషన్ వ్యవహారం మీడియాను మరింత ఆకట్టుకొన్నది. బోల్డ్‌గా కనిపించడం, వింత వింత దుస్తులు ధరించి మీడియా కెమెరాలకు ఆకర్షణీయంగా మారడం, బికినీ దుస్తులతో హోరెత్తించడం లాంటి విషయాలు మీడియాకు మరింత ప్రాధాన్యంగా మారాయి. అయితే మీడియాలో పాపులారిటి వచ్చినా ఆఫర్లు దక్కకపోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

బాలీవుడ్ నా తండ్రిది కాదు అంటూ
జాతీయ మీడియా ఎకనామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉర్పీ జావెద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫర్లు దక్కకపోవడానికి తనకు గాడ్ ఫాదర్ లేడు. బాలీవుడ్ అంటే నా సొంత జాగీరా.. లేదా నా అయ్యా జాగీరా అని ప్రశ్నించింది. బాలీవుడ్ నా తండ్రిది కాదు. నాకు ఆఫర్లు దక్కడానికి అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. కుప్పలుగా తెప్పలుగా ఆఫర్లు వస్తాయని నేను అనుకొంటే పెద్ద తప్పే అవుతుంది. మంచి ఆఫర్లు రావాలంటే మరో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందే అని ఉర్పీ జావెద్ ఘాటుగా సమాధానం చెప్పింది.

నా డ్రెస్సింగ్ వల్లనేనా? అంటూ ఉర్పీ
ఉర్ఫీ జావెద్ తాను ధరించే దుస్తుల గురించి స్పందించింది. మీడియాను కాకుండా సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానుల దృష్టిని ఎవరు కోరుకోరు? నేను ఒక్కదానినే ఇలాంటి దుస్తులు వేసుకొంటున్నానా? నాకే ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు. నేను ఎందుకు ఇతరుల దృష్టిలో పడకూడదు. ఆఫర్లు రాకపోతే నేను బతకడం లేదా? నాకంటూ ఓ లైఫ్ స్టయిల్ ఉంది. నేను ఎవరి దాయాదాక్షిణ్యాల మీద బతకను అంటూ ఉర్ఫీ జావెద్ ఘాటుగా స్పందించింది.


Click it and Unblock the Notifications











