For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇష్టం లేకున్నా ఆ నటుడి బనియన్ వేసుకున్నా, .. సీక్రెట్ బయటపెట్టిన ఊర్మిళ !

  |

  ఊర్మిళ మటోండ్కర్, జాకీ ష్రాఫ్ మరియు అమీర్ ఖాన్ నటించిన 'రంగీలా' సినిమా బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలిచింది. 1995 సంవత్సరంలో రిలీజయిన ఈ సినిమాలో పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. కానీ సినిమాలోని 'తన్హా తన్హా' పాటలో ఊర్మిళ మటోండ్కర్ వేసుకున్న బనియన్ గురించి తాజాగా ఊర్మిళ కొన్ని సీక్రెట్లు బయట పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే

  ఆయన బనియన్

  ఆయన బనియన్

  మీకు గుర్తుంటే, ' తన్హా తన్హా ' పాటలో , ఊర్మిళ మటోండ్కర్ సముద్రతీరంలో బనియన్ ధరించి పరిగెత్తడం కనిపిస్తుంది. ఈ పాటలో, ఊర్మిళ జాకీ ష్రాఫ్ తో కలిసి కనిపిస్తుంది. సాంగ్ లో జాకీ ఓన్లీ అండర్ వేర్ లో కనిపిస్తున్నారు ఊర్మిళ మటోండ్కర్ ఇటీవల కామెడీ షోలో ఈ కథ గుర్తుకు వచ్చింది. ఊర్మిళ మటోండ్కర్, 'రంగీలా' లోని 'తన్హా తన్హా' పాట కోసం నేను జాకీ ష్రాఫ్ బనియన్ ధరించానని ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చింది.

  అలా బనియన్ ఇచ్చి

  అలా బనియన్ ఇచ్చి

  ఈ సీక్వెన్స్‌ని ప్రత్యేకంగా మరియు రిఫ్రెషింగ్ గా మార్చాలనే ఉద్దేశ్యం ఉందని, ఆ సీన్ చాలా సహజంగా ఉండాలని మేము కోరుకున్నామని పేర్కొంది. ఇక జాకీకి నాకు ఆ సన్నివేశానికి సంబంధించిన దుస్తులు గురించి చెప్పినప్పుడు, జాకీ నన్ను తన బనియన్ ధరించమని అడిగాడు. మొదట నేను సంకోచించాను, కాని తర్వాత నేను బనియన్ వేసుకుని మిగిలిన అన్ని విషయాలను దేవుడికె వదిలేసానని ఆమె పేర్కొంది.

  చాలా పొగడ్తలు వచ్చాయి

  చాలా పొగడ్తలు వచ్చాయి


  అలా బనియన్ లో కనపడినందుకు నేను చాలా పొగడ్తలు మరియు ప్రేమను పొందానని అన్నారు. 'అంతకుముందు ఒక న్యూస్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయం గురించి ఒక సరదా కథనాన్ని పంచుకున్నారు. ఈ సాంగ్ చేయడం కోసం ఊర్మిళ మటోండ్కర్ దుస్తులను చూసినప్పుడు, అన్నిటినీ తిరస్కరించానని అన్నారు.

  స్పెషల్ గా ఉండాలని

  స్పెషల్ గా ఉండాలని


  రామ్ గోపాల్ వర్మ ఆ సన్నివేశం కోసం తనకు స్పెషల్ గా ఉండడం అవసరమ్మని చెప్పడంతో అప్పుడు జాకీ ష్రాఫ్ ఊర్మిళతో, తన బనియన్ లాంటి టీ షర్ట్ వేసుకోమని తీసి ఊర్మిళకు ధరించడానికి ఇచ్చాడని వెల్లడించారు. అలా ఆ సీన్ ను చూస్తే ఇప్పటికీ చర్చనీయాంశం అవుతూనే ఉంటుందని వెల్లడించారు. 'రంగీలా' చిత్రం, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ యొక్క మొదటి హిందీ తొలి చిత్రం.

  సూపర్ హిట్

  సూపర్ హిట్

  ఇక రంగీలా సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఎంతగా హిట్ అయ్యిందంటే అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రదర్శించబడింది. ఆ సినిమా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. తన్హా తన్హా పాట కోసం ఆశాభోంస్లే కి ప్రత్యేక జ్యూరీ అవార్డు కూడా లభించింది. ఇది కాకుండా, జాకీ ష్రాఫ్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు పొందారు.

  రాజకీయాల్లో బిజీ

  రాజకీయాల్లో బిజీ


  ఇక ఇటీవలే శివసేనలో చేరిన రెండో ఇన్నింగ్‌స్ కోసం ముంబైలో రూ. 3.75 కోట్లు విలువజేసే కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. కాంగ్రెస్‌లో ద్వారా రాజకీయాల్లో రంగప్రవేశం చేసిన ఆమె, లోకసభ ఎన్నికల్లో పరాజయం అనంతరం కాంగ్రెస్‌లోని అంతర్గత కుమ్ములాటల కారణంగా పార్టీకి రాజీనామా చేసింది. ఆ తరువాత ఇటీవలే శివసేనలో చేరిన ఆమెకు మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం గవర్నర్‌ కోటాలోని ఎమ్మెల్సీ పదవి కోసం సిఫారసు చేసింది.

  English summary
  Urmila Matondkar reveals she wore Jackie Shroff's ganjee
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X