గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన బాలీవుడ్ బ్యూటీ
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టాలీవుడ్‌లో మొదలై కోలీవుడ్, బాలీవుడ్ వరకు పాకింది. రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దశల్లొ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతమవ్వగా.. ఈ మధ్యే మూడో దశ గ్రీన్ఇండియా ఛాలెంజ్‌ను ప్రభాస్ చేత ప్రారంభించారు. ప్రభాస్ ప్రారంభించిన ఈ మూడో దశ ఫుల్ వైరల్ అవుతోంది.
దాదాపు తెలుగు సినీ ప్రముఖులందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. మొక్కలు నాటి.. మరో ముగ్గురికి సవాల్ కూడా విసిరారు. అలా ఈ సవాల్ మహేష్ బాబు వల్ల కోలీవుడ్‌కు చేరుకుంది. మహేష్ బాబు విసిరిన ఛాలెంజ్‌ను దళపతి విజయ్ స్వీకరించాడు. ఇక డైరెక్టర్ సంపత్ నంది విసిరిన ఛాలెంజ్‌ను బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా స్వీకరించింది. ఈ మేరకు మొక్కలు నాటిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ మేరకు తనను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం చేసినందుకు ఊర్వశీ ఎంతో సంతోషించింది. తనకు సవాల్ విసిరినందుకు సంపత్ నందికి థ్యాంక్స్ తెలిపింది. ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకువెళ్తున్నందుకు మహేష్ బాబు, ప్రభాస్, దళపతి విజయ్‌లకు థ్యాంక్స్ చెప్పింది. ఏది ఏమైనా ఊర్వశీ మాత్రం దక్షిణాది హీరోలపై ప్రశంసలు కురిపిస్తూ.. ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది.


Click it and Unblock the Notifications











