For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Katrina Kaif Engagement: అసలు నిజం చెప్పేసిన యువ హీరో తండ్రి.. అయినా సస్పెన్స్ వీడలేదు!

  |

  బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా సెలబ్రేటీలకు సంబంధించిన లవ్ గాసిప్స్ అయితే రోజుకోకటి వైరల్ అవుతుంటాయి. ఒకప్పుడు కేవలం సినిమాల్లో నటిస్తేనే స్టార్స్ కు సంబంధించిన గాసిప్స్ ఎక్కువగా వస్తుండేవి. కానీ ఇప్పుడు సినిమాల్లో నటించకపోయినా కాస్త క్లోజ్ గా ఉన్నా కూడా వారి మధ్య ప్రేమ సంబంధాలు కొనసాగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కత్రినా కైఫ్ తో యువ హీరో విక్కీ కౌశల్ ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా టాక్ అయితే వచ్చింది. అయితే అలాంటి బ్రేకింగ్ న్యూస్ లు ఎన్ని వచ్చినా వారు ఒక్కసారి కూడా వాటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆ డోస్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఫైనల్ గా ఆ రూమర్స్ పై విక్కీ కౌశల్ తండ్రి స్పందించారు.

   కేవలం బాలీవుడ్ లోనే కాదు

  కేవలం బాలీవుడ్ లోనే కాదు

  ఒకరినొకరు తరచుగా కలుసుకోవడంతో ఎక్కువగా బాలీవుడ్ మీడియా ఫోకస్ మొత్తం వారి పైన పెట్టింది. ఒకరి ఇంటివద్ద మరొకరు రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటారు. కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ మధ్య ప్రేమ బంధం మరింత ఎక్కువ అయ్యిందనే స్టోరీలు బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా తరచుగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై కత్రినా కైఫ్ పెద్దగా క్లారిటీ ఇవ్వకపోవడం తో కొత్త కన్ఫ్యూజన్ అయితే నెలకొంది.

  ఇద్దరికీ ఎంగేజ్మెంట్..

  ఇద్దరికీ ఎంగేజ్మెంట్..


  గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో వీరికి అభిమానుల నుంచి ప్రత్యేకంగా శుభాకాంక్షలు వెలువడుతూ ఉండటం ఓ వర్గం వారికి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయినట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యుల సమక్షంలోనే కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ ఇద్దరు కూడా రింగ్స్ మార్చుకొని నిశ్చితార్థ వేడుకను సింపుల్ గా పూర్తి చేసుకున్నట్లు స్టోరీలు వదిలేశారు. అది నిజమే అని ఓ వర్గం వారు ఈ జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

   క్లారిటీ ఇచ్చిన విక్కీ కౌశల్ తండ్రి

  క్లారిటీ ఇచ్చిన విక్కీ కౌశల్ తండ్రి

  ఈ విషయం నిజమా అబద్దమా అని తెలుసుకునేందుకు ఫిల్మీ బీట్ ప్రత్యేకంగా వారి సన్నిహితులను కలిసి అసలు నిజం తెలుసుకునే ప్రయత్నం చేసింది. విక్కీ కౌశల్ తండ్రి కౌశల్ ని సంప్రదించగా ఆయన ఆశ్చర్యానికి గురి అవుతూ అసలు క్లారిటీ ఇచ్చేశారు. తమ కొడుకు మరొక హీరోయిన్ కు నిశ్చితార్థం అయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతూ రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తాము క్లారిటీ ఇచ్చేవరకు ఇలాంటి వార్తలను ఎవరు నమ్మవద్దని కూడా ఆయన మీడియాకు తెలియజేశారు.

  సస్పెన్స్ విడేదెప్పుడు..

  సస్పెన్స్ విడేదెప్పుడు..


  దీంతో విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ నిశ్చితార్థంకు సంబంధించిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక వీరి పెళ్లి పై అప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదని కూడా టాక్ వస్తోంది. ఎన్ని రూమర్స్ వస్తున్నా కూడా ఇద్దరిలో ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. అందువల్లే ఆ కథనాలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. మరి కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఈ సస్పెన్స్ కు ఎప్పుడూ తెర దించుతారో చూడాలి.

  Katrina Kaif Recalls Her Encounter With South Star Vijay || Filmibeat Telugu
   సినిమాలతో బిజీబిజీగా..

  సినిమాలతో బిజీబిజీగా..


  ఇక ఈ టాలెంటెడ్ స్టార్స్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. కత్రినా కైఫ్ ఆయితే అదే తరహాలో తన స్థాయిని కొనసాగిస్తోంది. పోటీగా ఆమెకు ఎంత మంది హాట్ హీరోయిన్స్ వచ్చినా కూడా కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదు. తనదైన శైలిలో పెద్ద సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతోంది. సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం ఆమె సల్మాన్‌తో పాటు రష్యా వెళ్లనుందని సమాచారం. ఇక విక్కీ కౌశల్ విషయానికి వస్థే మిస్టర్ లెలే షూటింగ్‌లో అతను బిజీగా ఉన్నారు. ఇందులో కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

  English summary
  Vicky Kaushal's Father Reacts on his son Engagement Rumours With Katrina Kaif,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X