»   »  హీరోయిన్‌ను చెప్పుతో కొట్టబోయిన హీరో తల్లి.. అగ్రనటికి తీవ్ర అవమానం.. అసలేం జరిగిందంటే..

హీరోయిన్‌ను చెప్పుతో కొట్టబోయిన హీరో తల్లి.. అగ్రనటికి తీవ్ర అవమానం.. అసలేం జరిగిందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి రేఖ 70, 80 దశకాల్లో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోలందరూ తనతో నటించడానికి పోటీపడేవారు. దాదాపు 30 ఏళ్లపాటు హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రతారగా వెలుగొందింది. బాలీవుడ్‌లో తన అనుభవాలను, జీవిత చరిత్రను ది అన్‌టోల్డ్ స్టోరీ అనే పుస్తకం ద్వారా పంచుకొన్నారు. ఈ పుస్తకాన్ని యాసెర్ ఉస్మాన్ రచించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో ఓ ఆసక్తికరమైన సంఘటన పాఠకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.

 వినోద్ మెహ్రాతో అఫైర్

వినోద్ మెహ్రాతో అఫైర్

బాలీవుడ్‌లో స్టార్‌గా ముద్రపడిన వినోద్ మెహ్రాతో కొన్నాళ్లు రేఖ ప్రేమాయణం జరిపింది. వీరి మధ్య అఫైర్ గురించి 80వ దశకాల్లో మ్యాగజీన్లు, మీడియా కోడై కూసింది.

 బొంబాయి నుంచి కలకత్తాకు

బొంబాయి నుంచి కలకత్తాకు

తమ మధ్య ప్రేమయాణం మరోస్థాయికి చేరుకోవడంతో ఓ శుభ దినాన రేఖను అప్పటి బొంబాయి నుంచి తన వెంటబెట్టుకొని తన తల్లికి పరిచయం చేయడానికి కోల్‌కతాలోని తన ఇంటి తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన సన్నివేశం రేఖను కంటతడి పెట్టించిందట. ఇంటివద్ద ఏమి జరిగిందంటే..

 తల్లికి పరిచయం చేద్దామని

తల్లికి పరిచయం చేద్దామని

ప్రేమలో మునిగి తేలతున్నం రేఖను పెళ్లి చేసుకొని వినోద్ తన తల్లికి పరిచయం చేయాలనుకొన్నాడు. అదే ఉద్దేశంతో కోల్‌కతాకు తీసుకెళ్లాడు. ఇంటిలో రావడానికి ప్రయత్నించిన రేఖను వినోద్ తల్లి ఒక్క తోపు తోసేసిందట. కాళ్లను మొక్కడానికి ప్రయత్నిస్తే ఆగ్రహించిందట.

 ఇంట్లోకి అడుగుపెట్టనివ్వని

ఇంట్లోకి అడుగుపెట్టనివ్వని

వినోద్ మెహ్రా ఎన్ని ప్రయత్నాలు చేసినా రేఖను ఇంట్లో అడుగుపెట్టనివ్వలేదట. రేఖను అసభ్య పదజాలంతో దూషించిందట. దాంతో రేఖ కంటతడి పెట్టుకొన్నదట. కొత్త పెళ్లికూతురు అనే ఫీలింగ్ లేకుండా ఇంట్లోకి రానివ్వలేదట.

వినోద్ మెహ్రా ప్రయత్నాలు

వినోద్ మెహ్రా ప్రయత్నాలు

తల్లిని ఒప్పించడానికి వినోద్ చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరైందట. ఓ దశలో వినోద్ తల్లి కోపం తారాస్థాయికి చేరడంతో రేఖను చెప్పుతో కొట్టడానికి ముందుకెళ్లిందట. వినోద్ తల్లి చేష్టలతో రేఖ బిత్తరపోయి చూడటమైందట.

 రేఖ తీవ్ర అవమానం

రేఖ తీవ్ర అవమానం

వినోద్ ఇంట్లో జరిగిన అవమానానికి నొచ్చుకొన్న రేఖ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్దం కావడంతో అతడు కూడా ఆమెను అనుసరించాడట. వినోద్, రేఖ పెళ్లి వార్తను ఎన్నడూ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వినోద్ మెహ్రా మరణాంతరం ముఖేష్ అగర్వాల్ అనే వ్యాపారవేత్తను రేఖ వివాహం చేసుకొన్నది.

45 ఏటనే కన్నుమూసిన వినోద్ మెహ్రా

45 ఏటనే కన్నుమూసిన వినోద్ మెహ్రా

వినోద్ మెహ్రా బాలనటుడిగా 1958లో కిషోర్ కుమార్ రూపొందించిన రాగిణి చిత్రంలో నటించారు. ఏక్ థీ రీటా అనే సినిమాతో హీరోగా మారి ఓవర్‌నైట్‌లోనే స్టార్ అయ్యాడు. ఆ తర్వాత నిర్మాత, దర్శకుడిగా మారిన వినోద్ మెహ్రా తన 45వ ఏట మరణించాడు.

English summary
One incident that went 'viral' before the word was coined, is when Mehra took Rekha to his house in Mumbai (Bombay back then) and his mother almost beat the actress up with a sandal. Rekha's biography The Untold Story, by Yasser Usman, mentions the incident. According to a filmmaker, when Vinod Mehra, Rekha's rumoured husband, took her to his house in Bombay, after getting married in Calcutta (Kolkata now), Vinod's mother was furious.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu