Raj Kundra లీలలు.. నగ్నంగా ఆడిషన్ కోసం డిమాండ్.. నటి, మోడల్ సంచలన ఆరోపణలు

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత అతడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అడల్డ్ కంటెంట్ సినిమాలు తీస్తూ అనేక మందిని వేధింపులకు గురిచేశాడనే విషయం ఇప్పడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజ్ కుంద్రా లీలలను మోడల్ సాగరిక షోనా సుమన్ చెప్పిన విషయాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. మోడల్, నటి సాగరిక షోనా చెప్పిన విషయాలు ఏమిటంటే..

వెబ్ సిరీస్ కోసం రోల్ ఆఫర్

వెబ్ సిరీస్ కోసం రోల్ ఆఫర్

రాజ్ కుంద్రాపై సాగరిక ఫిబ్రవరి 2021లో సంచలన ఆరోపణలు చేశారు. ఆగస్టు 2020లో రాజ్ కుంద్రా ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. అందులో నాకు ఓ రోల్ ఆఫర్ చేశారు. ఆ సమయంలో నన్ను వీడియో కాల్‌లో న్యూడ్‌గా ఆడిషన్ ఇవ్వమని అడిగారు. అప్పుడు మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరు రాజ్ కుంద్రా అంటూ ఆమె వీడియోను రిలీజ్ చేశారు.

రాజ్ కుంద్రా టీమ్‌తో చేదు అనుభవం

రాజ్ కుంద్రా టీమ్‌తో చేదు అనుభవం

సాగరిక తన వీడియోలో మాట్లాడుతూ.. నేను మోడల్. ఇండస్ట్రీలో సుమారు 4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. కెరీర్ పరంగా, ప్రొఫెషనల్‌గా చాలా మంచి వర్క్ చేశాను. ఈ క్రమంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆగస్టు 2020లో ఉమేష్ కామత్ జీ అనే వ్యక్తి కాల్ చేసి రోల్ ఆఫర్ చేశారు. ఆ వెబ్ సిరీస్‌ను రాజ్ కుంద్రా నిర్మిస్తున్నట్టు చెప్పారు. నీవు ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తే నీ కెరీర్ టాప్ రేంజ్‌లో ఉంటుంది అని సాగరిక చెప్పారు.

వీడియో కాల్‌లో నగ్నంగా

వీడియో కాల్‌లో నగ్నంగా

ఉమేష్ జీ ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించడంతో నన్ను ఆడిషన్ ఇవ్వమని చెప్పారు. దాతో కోవిడ్ 19 పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కాబట్టి స్వయంగా వచ్చి ఆడిషన్ ఇవ్వలేనని చెప్పాను. దాంతో వీడియో కాల్ ద్వారా ఆడిషన్ ఇవ్వమని సూచించారు. ఆ తర్వాత న్యూడ్ ఆడిషన్ ఇవ్వమని డిమాండ్ చేశారు. దాంతో నేను షాక్ తిని అందుకు నిరాకరించాను.

ఆ సమయంలో ముగ్గురు ఉన్నారు. అందులో ఒకరు ముఖానికి గుడ్డతో కవర్ చేసుకొన్నారు. అతడే రాజ్ కుంద్రా అయి ఉంటాడు అని సాగరిక వెల్లడించారు.

ఉమేష్ కామత్ అరెస్ట్‌తో

ఉమేష్ కామత్ అరెస్ట్‌తో


ఇదిలా ఉండగా, రాజ్ కుంద్రా కంపెనీలో పనిచేసిన ఉమేష్ కామత్‌ను ముంబై పోలీసులు ఫిబ్రవరి 9వ తేదీన అరెస్ట్ చేశారు. పోర్న్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఉమేష్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ఉమేష్ 9 పోర్న్ వీడియోలు అప్‌లోడ్ చేశారు అని ముంబై పోలీసులు ధృవీకరించారు.

జూలై 19న రాజ్ కుంద్రా అరెస్ట్

జూలై 19న రాజ్ కుంద్రా అరెస్ట్


అడల్ట్ కంటెంట్ షూట్, మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ వ్యవహారంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో హిందీ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోర్నోగ్రాఫిక్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసి యాప్‌ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాను జూలై 19వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మోడల్, హీరోయిన్ గెహనా వశిష్ట్‌తోపాటు తొమ్మిది మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X