For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Yo Yo Honey Singh : తండ్రి దుర్మార్గుడు, బట్టలు మార్చుకుంటుంటే వచ్చి, అక్కడ టచ్ చేశాడు, భార్య సంచలన ఆరోపణలు!

  |

  సింగర్ మరియు రాపర్ యో యో హనీ సింగ్ భార్య షాలిని తల్వార్ రోజుకో కొత్త ఆరోపణతో వెలుగులోకి వస్తున్నారు.. ఇప్పటికే తన భర్త చాలా మంది స్త్రీలతో లైంగికంగా ఆనందించేవారు అంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆమె ఇప్పుడు తన మామ మీద కూడా అలాంటి ఆరోపణలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  'నన్ను జంతువులా చూస్తున్నారు'

  'నన్ను జంతువులా చూస్తున్నారు'

  తనను ఒక జంతువు లాగా చూస్తున్నారు అని హనీ సింగ్ భార్య షాలిని ఆగస్టు 3 న ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో భర్త మరియు అత్త మామలకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. భర్త హిర్దేశ్ సింగ్ తో తన వివాహమైన 10 సంవత్సరాల తర్వాత ఆమె గృహ హింస చేస్తున్నారని ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

  చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తానియా సింగ్ ఈ విషయంలో సింగర్ హనీ సింగ్‌ కు నోటీసు జారీ చేశారు. మరియు ఆగస్టు 28వ తేదీ లోపు సమాధానం కూడా కోరుతున్నారు. అయితే ఆరోపణల నేపథ్యంలో నోయిడాలో ఏ ఉమ్మడి ఆస్తిని హనీ సింగ్ కొనుగోలు చేయలేడు లేదా విక్రయించలేడని అలాగే షాలిని ఆభరణాలు కూడా విక్రయించ వద్దని కోర్టు సూచనలు చేసింది.

  మామగారితో పాటు, అత్తగారు కూడా

  మామగారితో పాటు, అత్తగారు కూడా

  'ఫ్రీ ప్రెస్ జర్నల్' నివేదిక ప్రకారం, షాలిని తల్వార్ తన భర్తతో పాటు ఆమె మామ, అత్తగారు మీద కేసు నమోదు చేసింది. వారి మీద మానసిక, శారీరక ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి తర్వాత హనీ సింగ్ తనపై చాలా సార్లు దాడి చేసి, హింసించి, మానసికంగా గాయపరిచారని షాలిని చెప్పింది. పెళ్లి తర్వాత హనీ సింగ్ చాలా మంది మహిళలతో అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్నాడని షాలిని ఆరోపించింది.

  38 ఏళ్ల షాలిని తన భర్తతో దీని గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు తనపై దాడి జరిగిందని చెప్పింది. షాలిని తల్వార్ తరఫున న్యాయవాదులు సందీప్ కపూర్, అపూర్వ పాండే మరియు జి జి కశ్యప్ పిటిషన్ దాఖలు చేశారు.

  'కుటుంబం మొత్తం కలిసి వేధింపులు'

  'కుటుంబం మొత్తం కలిసి వేధింపులు'

  షాలిని తల్వార్ మరియు హిర్దేశ్ సింగ్ అలియాస్ యో యో హనీ సింగ్ 23 జనవరి 2011 న వివాహం చేసుకున్నారు. అయితే, 2014 లో మాత్రమే అతని వైవాహిక స్థితి గురించి ప్రజలు తెలుసుకున్నారు. ఈ గాయకుడు తన కెరీర్‌లో ఎదుగుతున్న కారణంగా వైవాహిక స్థితి అప్పుడే రివీల్ కావాలని కోరుకోలేదు.

  అయితే వివాహమైన 10 సంవత్సరాల కాలంలో, హనీ సింగ్ తన భార్యపై చాలాసార్లు దారుణంగా కొట్టాడట. హనీ సింగ్ మరియు ఆమె కుటుంబం ద్వారా షాలిని మానసికంగా వేధించబడుతోంది మరియు హింసించబడుతోందని తన పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు.

  నేను బట్టలు మార్చుకుంటున్నా

  నేను బట్టలు మార్చుకుంటున్నా

  తన భర్త చాలా మంది మహిళలతో అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్నాడని షాలిని ఆరోపిస్తూ గృహ హింస ఆరోపణలను రుజువు చేయడానికి తన వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. షాలిని తల్వార్ తన భర్త హనీ సింగ్ నుండి 10 కోట్ల రూపాయలు పరిహారంగా డిమాండ్ చేశారు. దీనితో పాటు, ఢిల్లీలో షాలిని యొక్క ఇంటి అద్దెను నెలకు రూ. 5 లక్షలు చెల్లించాలని తన భర్తను ఆదేశించాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

  మామ తాగి వచ్చి అలా

  మామ తాగి వచ్చి అలా

  తన భర్త హనీ సింగ్ మీద సంచలన ఆరోపణలు చేసిన షాలిని ఇప్పుడు తన మామగారి గురించి అలాంటి ఆరోపణలు చేసింది. అయితే ఆమె చేసిన ఆరోపణలు విన్న తర్వాత ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. ఇప్పటికే గృహ హింస, మానసిక హింస మరియు లైంగిక హింసకు పాల్పడుతున్నాడు అంటూ భర్త హనీ సింగ్ అలియాస్ హిర్దేశ్ సింగ్‌పై కేసు నమోదు చేసిన షాలిని, ఇప్పుడు ఆమె మామ సరబ్‌జిత్ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఒకరోజు తాను గదిలో బట్టలు మార్చుకుంటున్నప్పుడు, మామగారు మద్యం మత్తులో గదిలోకి ప్రవేశించారని షాలిని పేర్కొంది. ఇది మాత్రమే కాదు, షాలిని వాదన ప్రకారం ప్రకారం, మామగారు తన బ్రెస్ట్ ను కూడా తాకారట.

  #YoSonakshiSoDumb | Sonakshi Sinha Trolled For Not Knowing Ramayana
  మెంటల్ టార్చర్

  మెంటల్ టార్చర్

  38 ఏళ్ల తల్వార్, గత కొన్ని సంవత్సరాలుగా సింగ్ తనను చాలాసార్లు కొట్టాడని మరియు అతను మరియు అతని కుటుంబం తనను శారీరకంగా బెదిరించడంతో నిరంతరం భయంతో జీవిస్తున్నానని పేర్కొన్నారు. "కొంత కాలంగా మానసిక వేధింపులు మరియు క్రూరత్వం కారణంగా, ఆమె కూడా డిప్రెషన్ లక్షణాలతో బాధపడుతోంది మరియు వైద్య సహాయం కోరింది" అని ఆమె న్యాయవాది సందీప్ కపూర్, అపూర్వ పాండే మరియు జి కశ్యప్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుంది ఆమె ఇంకా ఎన్ని ఆరోపణలు చేయబోతోంది అనే అంశం మీద అయితే ఎలాంటి క్లారిటీ లేదు.. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Singer and rapper Yo Yo Honey Singh's wife Shalini Talwar is coming to light with a new allegation on a daily basis. Shalini, who has already registered a case against her husband Honey Singh alias Hirdesh Singh for alleged domestic violence, psychological violence and sexual violence, has now leveled sensational allegations against her uncle Sarabjit Singh. Shalini claims that one day while she was changing clothes in the living room, her father-in-law entered the room under the influence of alcohol. Not only this, according to Shalini's argument, her father-in-law also touched her breast.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X