For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Yo Yo Honey Singh.. హింస పెట్టి చంపేస్తున్నాడు.. కోర్టుకు ఎక్కిన స్టార్ సింగర్ భార్య

  |

  బాలీవుడ్ సింగర్, ర్యాపర్ యోయో హానీ సింగ్ సమస్యల్లో కూరుకుపోయారు. ప్రశాంతంగా సాగుతున్న కాపురంలో కలతలు చెలరేగడంతో ఆయనపై కేసు నమోదు కావడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హానీ సింగ్‌పై భార్య చేసిన ఫిర్యాదుతో గృహ హింస చట్టం కింద కేసు నమోదైంది. ఈ వివాదంలో గాయకుడికి నోటీసులు జారీ చేసి ఆగస్టు 28వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో హానీ సింగ్ మీడియా పతాక శీర్షికలను ఆకర్షించారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

  గృహ హింస చట్టం కింద నోటీసులు

  గృహ హింస చట్టం కింద నోటీసులు

  హానీ సింగ్‌పై భార్య షాలిని తల్వార్ ఫిర్యాదు చేస్తూ తనను గృహ హింసకు గురిచేస్తున్నాడు. అలాగే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. మానసికంగా క్షోభకు గురి చేస్తున్నాడు. కట్నం కోసం వేధిస్తున్నాడు అంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దాంతో హానీ సింగ్‌పై ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తీస్ హాజరీలోని మిస్ తానియా సింగ్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌లో కేసు నమోదైంది. హానీ సింగ్ భార్య షాలిని తరఫున సందీప్ కపూర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

  ఆస్తి అమ్మకం వివాదంలో

  ఆస్తి అమ్మకం వివాదంలో

  అలాగే భార్య షాలిని ఫిర్యాదు నేపథ్యంలో హానీ సింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల తన ఆస్తిని హాని సింగ్ అమ్మడానికి ప్రయత్నించగా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇద్దరి పొత్తులో ఉన్న ఆస్తిని అమ్మడానికి హక్కు లేదంటూ హానీ సింగ్‌ను ఆదేశించింది. దీంతో మరోసారి వివాదంలో కూరుకుపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి.

  Katrina Kaif నాలుగు పదుల వయసులో తగ్గని గ్లామర్ డోస్.. లేటేస్ట్ ఫోటోలు వైరల్!

  మ్యూజిక్ ప్రపంచానికి దూరంగా

  మ్యూజిక్ ప్రపంచానికి దూరంగా

  గత కొద్దికాలంగా యో యో హానీ సింగ్ పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కెరీర్ పరంగా టాప్ రేంజ్‌లో ఉండగా అనూహ్యంగా మ్యూజిక్ ప్రపంచం నుంచి కనుమరుగైపోయాడు. డిప్రెషన్ గురి అవ్వడంతోనే తాను మ్యూజిక్‌కు దూరం అయ్యాను. నా జీవితంలో దుర్భరమైన దశ కొనసాగుతున్నది. మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. నిద్రలేమితో బాధపడటం వల్ల ఆరోగ్యపరంగా అనేక సమస్యలు తలెత్తాయి. నాలో రుగ్మతలు నాకు తెలియడానికే కనీసం నాలుగు నెలలు పట్టింది అంటూ యోయో హానీ సింగ్ గతంలో వెల్లడించారు.

  మానసిక రుగ్మతలతో రెండున్నర ఏళ్లు

  మానసిక రుగ్మతలతో రెండున్నర ఏళ్లు

  మానసిక రుగ్మతల కారణంగా యో యో సింగ్ కెరీర్ దాదాపు మసకబారిపోయింది. సుమారు రెండున్నర ఏళ్లు ఆయన ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అయితే తాను తన సమస్యలను దాచడం నాకు ఇష్టం లేదు. నా అభిమానులకు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. నా ఫ్యాన్స్‌కు నేను జవాబుదారీగా ఉంటాను అని యో యో సింగ్ చెప్పారు.

  క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన యాంకర్ మంజూష.. రష్మీ, అనసూయకు పోటీ ఇచ్చేలా హాట్ స్టిల్స్

  భార్య షాలినితో వైవాహిక జీవితం

  భార్య షాలినితో వైవాహిక జీవితం

  ఇక షాలినితో ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే.. 2014లో ఓ మ్యూజిక్ రియాలిటీ షోలో తన భార్యను పరిచయం చేయడం సంగీత అభిమానులు దిగ్బ్రాంతి గురయ్యారు. యో యో సింగ్ ఎవరికీ చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసుకొని భార్యను షో ద్వారా పరిచయం చేయడంతో అందరూ షాక్ తిన్నారు. అయితే తాజాగా విభేదాలు రావడంతో యో యో సింగ్ పరిస్థితి మరింత ప్రతికూలంగా మారింది.

  #YoSonakshiSoDumb | Sonakshi Sinha Trolled For Not Knowing Ramayana
  యో యో హానీ సింగ్ కెరీర్ ఇలా..

  యో యో హానీ సింగ్ కెరీర్ ఇలా..

  ర్యాప్ స్టార్ యో యో హానీ సింగ్ 2005లో పేషి మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2006లో బేగాని నార్ అనే మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా క్రేజ్‌ను సంపాదించుకొన్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో షకాత్ పే మత్ జా, కాక్ టెయిల్, రేస్ 2, చెన్నై ఎక్స్‌ప్రెస్, బాస్, యారియాన్, కిక్ లాంటి చిత్రాలకు గాయకుడిగా వ్యవహరించారు. చివరిగా 2020లో ముంబై సాగా చిత్రంలో ఓ పాటను పాడారు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Bollywood Singer Yo Yo Honey Singh in trouble: wife Shalini filed domestic violence case. His wife alleges singer that, he was doing financial violence against me.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X