For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫోటో షేర్ చేసి ట్రోల్స్ బారిన పడిన హీరోయిన్.. నెటిజన్లకు దిమ్మతిరిగే కౌంటర్.. హాట్ టాపిక్ ఇష్యూ!

  |

  నేటితరం హీరో హీరోయిన్లకు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ప్రధాన ప్రచార సాధనాలుగా మారాయి. నానాటికీ పెరుగుతున్న ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నెట్టింట హల్చల్ చేస్తున్నారు ఇప్పటి నటీనటులు. ఎప్పటికప్పుడు తమ తమ లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ టచ్‌లో ఉంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అదే సాంకేతికత వారికి లేని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో నెటిజన్ల ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ సమస్య బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్‌కి ఎదురు కావడం, దానిపై ఆమె రియాక్ట్ కావడం జరిగాయి. వివరాల్లోకి పోతే..

  బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్‌

  బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్‌

  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ 'వీర్‌' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది హీరోయిన్ జరీన్ ఖాన్‌. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో మరోసారి సల్మాన్ సరసన 'రెడీ' సినిమాలో నటించింది జరీన్. ఆ తర్వాత 'హౌస్ ఫుల్ 4' సినిమాలో నటించి మెప్పించింది జరీన్ ఖాన్.

  సోషల్ మీడియాలో ఫోటో.. పొట్టభాగంలో అలా

  సోషల్ మీడియాలో ఫోటో.. పొట్టభాగంలో అలా

  సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈమె తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఓ ఫోటో షేర్ చేస్తూ దానికి 'సిటీ ఆఫ్ లేక్స్' అని కాప్షన్ ఇచ్చింది. జరీనా షేర్ చేసిన ఈ ఫొటోలో ఆమె పొట్ట భాగం ముడతలు పడినట్లుగా కనిపించడంతో దీనిపై ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ పిక్ నెట్టింట హాట్ టాపిక్ అయింది.

  సర్జరీ చేయించుకున్నావా? లేక.. అంటూ

  సర్జరీ చేయించుకున్నావా? లేక.. అంటూ

  'పొట్టపై ఆ కుట్లు ఏంటి మేడం? బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకున్నావా..? అయినా అంతలా లావెక్కడం దీనికి' అంటూ ఆమెపై రెచ్చిపోయి ట్రోల్స్ చేశారు నెటిజన్లు. ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు కామెంట్స్ చేయడం చూసిన జరీనా ఇక లాభం లేదని అదే సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

  ఎందుకంత ఉత్సాహం.. అది మాత్రమే నాకు ఇష్టం

  ''నా పొట్ట భాగాన్ని చూసి చాలా మంది ఉత్సాహం కామెంట్లు పెడుతున్నారు. వాళ్లందరికీ నా పొట్ట భాగంలో ఏమైందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. సాధారణంగా 50 కిలోలకు పైగా బరువు తగ్గిన ఏ వ్యక్తి పొట్ట అయినా సహజంగా ఇలానే ఉంటుంది. నేను ఈ ఫొటోను ఫొటోషాప్‌ చేసి మెరుగులు దిద్దలేదు, అలాగే సర్జరీ కూడా చేయించుకోలేదు. నా అసలైన శరీర సౌందర్యాన్ని మాత్రమే నేను ఇష్టపడతాను. ఒకవేళ నా శరీరంలో ఏవైనా లోపాలున్నా వాటిని కవర్‌ చేయడం నాకు ఇష్టముండదు. దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టకండి'' అంటూ నెటిజన్లకు దిమ్మతిరిగే కౌంటర్ వేసింది జరీనా ఖాన్.

  బాలీవుడ్ భామల సపోర్ట్

  బాలీవుడ్ భామల సపోర్ట్

  తనపై వచ్చిన ట్రోల్స్‌పై జరీనా ఖాన్ స్పందన చూసి పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ ఆమెను అభినందిస్తున్నారు. జరీనా ఖాన్ నువ్ చాలా ధైర్యవంతురాలివి అంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఆమెకి మద్దతు తెలపడం విశేషం. గోపీచంద్ హీరోగా రాబోతున్న 'చాణక్య' సినిమాతో తెలుగు తెరపై కూడా అడుగుపెడుతోంది జరీనా.

  English summary
  Bollywood heroine Zareen Khan was body-shamed for sharing a picture showing stretch marks on her stomach. These pic gets trolls from the netijans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X