For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  19 years of Jayam: మెగా హీరోను కాదని నితిన్‌కు అవకాశం.. కుంభవృష్టిగా కలెక్షన్స్

  |

  సినిమా ఇండస్ట్రీలో మరపురాని సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఒక జనరేషన్ లో సరికొత్తగా ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు కొన్నే ఉన్నాయి. అంతకుముందు, ఆ తరువాత అనేలా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి కుంభ వృష్టి కురిపించిన సినిమాల్లో జయం ఒకటి. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా విడుదలై నేటికి 19 ఏళ్లవుతోంది. ఆ సినిమా కోసం మొదట మెగా హీరోను అనుకున్నారు. ఇక మొత్తం బడ్జెట్, కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

  Actor Gopichand Inspiring Life Story | Filmibeat Telugu
  నిర్మాతలు సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదని

  నిర్మాతలు సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదని

  స్టార్ క్యాస్ట్ తో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల హవా కొనసాగుతున్న సమయంలో దర్శకుడు తేజ చేసిన లవ్ ప్రయోగాలు అప్పట్లో ట్రెండ్ సెట్ చేశాయి. చిత్రం, నువ్వు నేను వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం నిర్మాతలు సరిగ్గా రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని సొంత ప్రొడక్షన్ లోనే జయం సినిమా చేశాడు.

  మెగా హీరోను కాదని

  మెగా హీరోను కాదని

  కేవలం తన బ్రాండ్ తోనే సినిమాలను నిర్మించిన తేజ మొదట్లో ఈ సినిమా కోసం నితిన్ ను అనుకోలేదట. చాలామంది కొత్త వారితో ఆడిషన్స్ చేశాడట. అందులో ఒక మెగా హీరో కూడా ఉన్నాడట. అతను మరెవరో కాదు అల్లు అర్జున్. గంగోత్రి కంటే ముందే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకును పరిచయం చేయాలని తేజతో మాట్లాడాడు. అప్పట్లో బన్నీ కొత్త కావడంతో ఆడిషన్స్ చేయగా అంతగా నచ్చలేదట. తరువాత చేద్దామని అల్లు అరవింద్ కు చెప్పారట.

  నితిన్ ఎలా సెలెక్ట్ అయ్యాడంటే..

  నితిన్ ఎలా సెలెక్ట్ అయ్యాడంటే..

  నువ్వు నేను సినిమా రిలీజ్ సమయంలో ఆ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా చేసిన సుధాకర్ రెడ్డి తేజకు మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. తన కొడుకు యొక్క ఫొటోలు ఇవ్వడంతో మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపని తేజ ఆ తరువాత ఆడిషన్స్ చూసి ఇంప్రెస్ అయ్యాడట. నితిన్ తొలిప్రేమలోని పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అలాగే పవన్ స్టైల్ లో డ్యాన్స్ చేసి చూపించి దర్శకుడిని ను ఇంప్రెస్ చేశాడు.

  మొదట గోపిచంద్ ను విలన్ గా అనుకోలేదు

  మొదట గోపిచంద్ ను విలన్ గా అనుకోలేదు

  ఈ సినిమాలో అందరికంటే ఎక్కువగా విలన్ గా గోపిచంద్ హైలెట్ అయ్యాడు. అతనికంటే ముందు ఒక బాలీవుడ్ యాక్టర్ ను అనుకున్నారు. కానీ అతను అంతగా నచ్చకపోవడంతో గోపీచంద్ ను ఫైనల్ చేశారు. అలాగే గోపిచంద్ తండ్రి టీ.కృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసిన తేజ ఆయన మంచితనం వలన గోపిచంద్ కు అవకాశం ఇచ్చినట్లు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

  బడ్జెట్ ఎంతంటే..

  బడ్జెట్ ఎంతంటే..

  1.80కోట్లతో 65రోజుల్లో సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. దర్శకుడు తేజ అంతకు ముంచి వచ్చిన రెమ్యునరేషన్ తో పాటు కొంత అప్పు చేసి మొత్తం ఆ సినిమాపైనే పెట్టుబడి పెట్టాడు. సినిమా ఏ మాత్రం బెడిసికొట్టినా చాలా కష్టాలు పడాల్సి వచ్చెదట. ఆర్పీ.పట్నాయక్ అందించిన పాటలు సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే హీరోయిన్ సదా, కమెడియన్ సుమన్ శెట్టితో పాటు 30మంది కొత్త ఆర్టిస్టులు పరిచయం అయ్యారు.

  మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..?

  మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..?

  ఇక 2002 జూన్ 14న విడుదలైన జయం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మొదట 50 ప్రింట్లతో విడుదలై ఆ తరువాత 150ప్రింట్లకు చేరింది. 70 సెంటర్లలో 100రోజులు ఆడింది. నెలరోజుల పాటు హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో జయం తెలుగు రాష్ట్రంలో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించింది. మొత్తంగా 32కోట్ల వరకు కలెక్షన్స్ అందుకొని డైరెక్టర్ తేజకు పెట్టిన పెట్టుబడికి భారీ లాభాలను అందించింది.

  English summary
  Jayam movie was one of the films that Aquarius rained down on investment at the box office. It has been 19 years since the release of the film directed by Teja. The mega hero was initially thought of for that movie. If you go into the total budget and collections details ..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X