Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Sports
Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్‌లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
2.O కలెక్షన్లు: సునామీలా రూ.400 కోట్లు, బ్లాక్‌బస్టర్ కాదు.. మెగా బ్లాక్‌బస్టర్!
సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 2.0 మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో హల్‌చల్ చేస్తుందని భావించారు. అయితే ఈ చిత్ర రిలీజ్‌కు ముందు వేసిన ట్రేడ్ వర్గాల అంచనాలను అందుకోకపోడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. రజనీకాంత్ చెప్పినట్టు ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను అందుకోకపోవడం గమనార్హం. గత నాలుగు రోజుల కలెక్షన్లు చూస్తూ 2.0 చిత్రం బాహుబలి, పీకే రికార్డులను టచ్ చేయకపోవడం కొంత నిరాశ కలిగించే అంశంగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

వీకెండ్‌లో వసూళ్ల హవా
2.O మూవీ మొదటి రెండు రోజుల కలెక్షన్లు అంత ఆశాజనకంగా లేవు. కానీ శనివారం, ఆదివారాలు వీకెండ్ హాలీడేస్ కావడంతో థియేటర్లకు భారీగా అభిమానులు, ప్రేక్షకులు పోటేత్తారు. దాంతో భారీ కలెక్షన్లు నమోదయ్యాయి.

ఓవర్సీస్ మార్కెట్‌లో
2.O మూవీ ఓవర్సీస్ మార్కెట్‌లో విలయతాండవం చేస్తున్నది. అమెరికా, యూకే, మలేషియాలో ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. అమెరికాలో రూ.21 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ.4.87 కోట్లు, యూకేలో రూ.3.77 కోట్లు, మలేషియాలో రూ.2.86 కోట్లు, న్యూజిలాండ్‌లో రూ.377 కోట్లు, సింగపూర్‌లో రూ.33.08 లక్షలు, జర్మనీలో రూ.13.73 లక్షలు వసూలు చేశాయి.

స్వదేశంలో రూ.300 కోట్లు
దక్షిణాది, ఉత్తరాదిలో 2.O మూవీ భారీగా వసూళ్లు సాధిస్తున్నాయి. దక్షిణాదిలో చిత్రం రూ.132.3 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.130 కోట్లు సాధించింది. కర్ణాటకలో రూ.20 కోట్లు, కేరళలో రూ.10 కోట్లు సాధించింది. దాంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 300 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

లైకా ప్రొడక్షన్ ట్వీట్ చేసి
2.O మూవీ వసూళు చేసిన కలెక్షన్లు రికార్డు తిరగరాశాయి. 2.O మూవీ చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా మూవీ రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది. ఇది బ్లాక్ బస్టర్ కాదు. మెగా బ్లాక్ బస్టర్ మూవీ అంటూ లైకా ప్రొడక్షన్ ట్వీట్ చేసింది.

బాహుబలి, పీకే రికార్డులను
2.O మూవీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ విజయాలు సాధించిన క్రేజీ రికార్డులను అందుకోలేకపోతున్నది. నాలుగు రోజుల వసూళ్లను పరిశీలిస్తే రాజమౌళి రూపొందించిన బాహుబలి, అమీర్ ఖాన్ చిత్రం పీకే, దంగల్ సినిమాల రికార్డులు చెక్కుచెదురకుండా అలానే ఉన్నాయి. ఈ చిత్రాలపై 2.O మూవీ ప్రభావం చూపలేకపోతున్నది.

రూ.600 కోట్లతో
దేశ సినీ చరిత్రలోనే గతంలో ఎన్నడూలేని విధంగా 2.O మూవీ సుమారు రూ.600 కోట్లతో రూపొందింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. అమీ జాక్సన్, ఆదిల్ హుస్సేన్, సుధాంశు పాండే తదితరులు నటించారు.