»   » యూఎస్ఏ రిపోర్ట్: బాహుబలి 2ను అధిగమించడంలో 2.0 ఫెయిల్

యూఎస్ఏ రిపోర్ట్: బాహుబలి 2ను అధిగమించడంలో 2.0 ఫెయిల్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో శంకర్ రూపొందించిన 2.0 చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మంచి ఊపుతో మొదలైనప్పటికీ యూఎస్ఏలో మాత్రం చాలా స్లోగా స్టార్ అయినట్లు తెలుస్తోంది.

  ఈ మూవీ యూఎస్ఏ రైట్స్ ప్రైమ్ మీడియా సంస్థ దక్కించుకుంది. ఈ చిత్రంపై భారీ హైప్ ఉండటం, రికార్డు స్థాయిలో థియేట్రికల్ రైట్స్ అమ్ముడవ్వడంతో... నార్త్ అమెరికా వ్యాప్తంగా 800 స్క్రీన్లలో భారీగా విడుదల చేశారు.

  బాహుబలి 2ను బద్దలు కొడుతుందనుకున్నారు

  బాహుబలి 2ను బద్దలు కొడుతుందనుకున్నారు

  బాహుబలి 2 సినిమా విడుదల ముందే ప్రీ టికెట్ సేల్స్ $3 మిలియన్ల మేర జరిగింది. యూఎస్ఏ ప్రీమియర్స్ ద్వారా $3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీన్ని 2.0 చిత్రం అధిగమిస్తుందని అంతా భావించారు.

  పూర్‌గా మొదలైన ప్రీమియర్ షోలు

  పూర్‌గా మొదలైన ప్రీమియర్ షోలు

  అయితే బుధవారం యూఎస్ఏ వ్యాప్తంగా వేసిన ప్రీమియర్ షోలకు ఆశించిన మేర ఆదరణ లభించలేదట. అందుకే యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా కలెక్షన్ల వివరాలు బయటకు వెల్లడించలేదనే టాక్ వినిపిస్తోంది.

   అందరూ మౌనంగా...

  అందరూ మౌనంగా...


  పెద్ద సినిమాలు విడుదలైన సమయంలో పలువురు ట్రేడ్ విశ్లేషకులు రెన్ట్రాక్ నుంచి కలెక్షన్ల వివరాలు సేకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇప్పటికే ఆ వివరాలు బయటకు రావాల్సి ఉండగా... ఎవరూ వివరాలు బయట పెట్టకుండా మౌనం వహించడం గమనార్హం.

  అధిక ధరలే కారణమా?

  అధిక ధరలే కారణమా?

  యూఎస్ఏ ఆడియన్స్ 3డి సినిమాలు నార్మల్ రేటుకే చూస్తుంటారు. అయితే రజనీకాంత్ 2.0 మూవీకి మాత్రం వారు 30 డాలర్లు వెచ్చించాల్సి వస్తోందట. అందుకే ప్రీమియర షోలకు ఆదరణ తగ్గిందని, ప్రీ టికెట్ సేల్స్ అక్కడ తక్కువగా జరుగడానికి కారణం కూడా అదే అని అంటున్నారు.

  డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏమంటోంది?

  అయితే యూఎస్ఏ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రైమీడియా వాదన మరోలా ఉంది. ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు సరిగా జరుగలేని, ఫస్ట్ డే నుంచి అంతా సక్రమంగా ఉంటుందని ట్వీట్ చేయడం గమనార్హం.

  ఇండియాలో టికెట్ సేల్స్ అదుర్స్

  ఇండియాలో టికెట్ సేల్స్ అదుర్స్

  మరో వైపు ఇండియాలో 2.0 టికెట్ సేల్స్ అదిరిపోతున్నాయి. బుక్ మైషో ద్వారా 1 మిలియన్, పేటీఎం ద్వారా 1.25 మిలియన్ టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ నెంబర్స్ బట్టి 2.0 సినిమాపై భారతీయ ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

  English summary
  Director Shankar's 2.0 (also known as Enthiran/Robot/ Robo2.o) starring Rajinikanth and Akshay Kumar has received a slow start and made an average collection at the US box office in the premiere shows. "#2Point0 storm in 15 mins. Lot of things didn't go as planned for premier shows. Thanks for being patient with us. We should be in full force from tomorrow. Enjoy this beautiful creation by Shankar and watch it with... " Prime Media tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more