Don't Miss!
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ విషయంలో వాడి వేడి చర్చ.. బీసీసీఐకి పాక్ స్ట్రాంగ్ వార్నింగ్?
- Finance
SBI Q3 Result: రికార్డు లాభాలను నమోదు చేసిన స్టేట్ బ్యాంక్.. అంచనాలను తలదన్నేలా..
- News
తెలంగాణా బడ్జెట్ హైలైట్స్: బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట; కేసీఆర్ మార్క్ బాహుబలి బడ్జెట్ కేటాయింపులిలా!!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
2.0 మూవీ కథ ముగిసినట్టేనా? భారీ స్పందన కరువు.. 11 రోజుల కలెక్షన్లు ఇవే..
సూపర్‌స్టార్లు రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన 2.O మూవీ రెండో వారంలో కూడా సంతృప్తికరమైన వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో రెండోవారంతం మోస్టారు కలెక్షన్లను వసూలు చేసింది. హిందీ వెర్షన్‌లో రిలీజ్ అయిన సెంటర్లలో అక్యుపెన్సీ రేటు సగటు కంటె ఎక్కువగానే ఉండటం గమనార్హం. కొన్ని సెంటర్లలో వారాంతం కలెక్షన్లు వృద్ధిని సాధించింది. 11 రోజుల 2.O మూవీ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

తమిళనాడులో కలెక్షన్లు
తమిళనాడులో 2.O మూవీకి పెద్దగా అంతగా స్పందన కనిపించలేదు. పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో 2.O మూవీ ఓ మోస్తారు వసూళ్లు రాబట్టింది. చిన్న సినిమాలు రిలీజైన పెద్దగా ఈ మూవీకి పోటీని ఇవ్వలేకపోయాయి. గత 11 రోజుల్లో రూ.80 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు తెలిసింది. చెన్నైలోనే ఈ చిత్రం రూ.18.41 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లో 2.O మూవీకి మంచి స్పందన లభించింది. శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వసూళ్లు కనిపించాయి. ఈ చిత్రం సుమారు 82 కోట్ల వరకు వసూళు చేసినట్టు అంచనా వేస్తున్నారు.

కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వసూళ్లు
ఇక కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పెద్దగా వసూళ్లు పెరగకపోవడం గమనార్హం. కేరళలో రూ.16.3 కోట్లు, కర్ణాటకలో 30.5 కోట్లు వసూలు చేశాయి. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్లు కలుపుకొంటే రూ.204.8 కోట్లు వసూలు చేసినట్టయింది. ఉత్తరాదిలో సాధించిన రూ.210 కోట్లతో పోల్చుకొంటే రూ.414.8 కోట్లు సాధించింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో కలెక్షన్లు
ప్రతిష్టాత్మకంగా రూపొందిన 2.0 మూవీ ఓవర్సీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం గత 11 రోజుల్లో 5 మిలియన్ల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. రూపాయల్లో చూసుకొంటే ఈ మూవీ ఓవర్సీస్ 125 కోట్లు సాధించింది. దాంతో ఈ సినిమా ప్రస్తుతం రూ.600 కోట్ల వద్ద నిలిచింది. ఇక మూడో వారంలోకి ప్రవేశిస్తున్న ఈ సినిమా కష్టంగా వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తున్నది.

సల్మాన్ ఖాన్ రికార్డు బ్రేక్
దేశీయ బాక్సాఫీస్ వద్ద 2.O మూవీ సరికొత్త ఘనతను సాధించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. గతంలో బాహుబలి2 రూ.1430 కోట్లు, బాహుబలి రూ.516 కోట్లు, దంగల్ రూ.412 కోట్లు సాధించాయి. ఇక 2.0 మూవీ చిత్రం సుల్తాన్ వసూలు చేసిన రూ.300.67 కలెక్షన్లు అధిగమించింది.