Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020 బాక్సాఫీస్ రిపోర్ట్: ఆ ఇద్దరు హీరోలవే టాప్‌లో.. రికార్డు క్రియేట్ చేసిన చిన్న సినిమా!
2020 సంవత్సరంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. సంక్రాంతి సీజన్‌లో విడుదలైన రెండు పెద్ద సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో పాటు లాభల పంట పండించుకున్నాయి. ఆ తర్వాత ఇదే రీతిలో బిజినెస్ కొనసాగుతుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ రావడంతో షూటింగ్ నిలిచిపోయాయి. అలాగే, థియేటర్లు కూడా మూతపడిపోయాయి. దీంతో టాలీవుడ్ నష్టాల బాటలో పయనించింది. 2020 పూర్తవుతోన్న సందర్భంగా ఈ తక్కువ సమయంలో విడుదలైన సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్‌ను ఓ సారి చూద్దాం పదండి!

కలెక్షన్ల వర్షం కురిపించిన మెగా మూవీ
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. మొత్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 65 కోట్లు వరకు జరిగింది. ముగింపు సమయానికి రూ. 132 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది.

అదే బాటలో పయనించిన సూపర్ స్టార్
వరుస విజయాలతో దూసుకుపోతోన్న మహేశ్ బాబు.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేసిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. ఇది కూడా సంక్రాంతి కానుకగానే విడుదలై ఘన విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 76.6 కోట్లు వరకు జరిగింది. ముగింపు సమయానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 107.6 కోట్ల షేర్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

జనవరిలోనే పరాజయాల చిత్రాలు ఇవే
సంక్రాంతి కానుకగానే విడుదలైన నందమూరి కల్యాణ్ రామ్ చిత్రం ‘ఎంత మంచివాడవురా' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 12 కోట్లు కోట్లు వరకు జరిగగా, షేర్ మాత్రం రూ. 6 కోట్లే వచ్చింది. అలాగే, మాస్ మహారాజా సినిమా కూడా జనవరిలోనే విడుదలైంది. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 16.4 కోట్లు వరకు జరగగా, కలెక్షన్లు మాత్రం రూ. 6.5 కోట్లే వచ్చాయి. దీంతో ఈ రెండూ డిజాస్టర్లుగా మిగిలాయి.

భారీ నష్టాల్లో మునిగిపోయిన చిత్రాలివే
ఈ ఏడాది విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్'. ఎన్నో అంచనాలతో విడుదలైన ఇది ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 20.5 కోట్లు కోట్లు వరకు జరిగగా, షేర్ మాత్రం రూ. 8.5 కోట్లే వచ్చింది. అలాగే, ‘96' రీమేక్ ‘జాను' కూడా రూ. 16 కోట్ల బిజినెస్ చేసి.. రూ. 6.9 కోట్లే రాబట్టింది. ఈ రెండు చిత్రాలు నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి.

ఈ ఏడాది చివరి హిట్‌గా నిలిచన చిత్రం
వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నటించిన చిత్రం ‘భీష్మ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను అలరిస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 19.6 కోట్లు వరకు జరగగా, రూ. 23 కోట్ల వరకూ రాబట్టి సత్తా చాటింది. ఫలితంగా నితిన్ కెరీర్‌లో బెస్ట్ మూవీల్లో ఒకటిగా నిలిచింది.

చిన్న సినిమానే పెద్ద హిట్... కలెక్షన్లూ
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం ‘హిట్'. విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాను హీరో నాని నిర్మించాడు. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 4.4 కోట్లు జరగగా, దాదాపు రూ. 7.50 కోట్ల రాబట్టి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీనితో పాటు ఓటీటీలో రిలీజ్ అయిన పలు చిత్రాలు కూడా లాభల పంట పడించాయి. కొన్ని నిరాశ పరిచాయి.