»   » ఇంత తక్కువా?: '1-నేనొక్కడినే' 50 డేస్ సెంటర్స్ లిస్ట్

ఇంత తక్కువా?: '1-నేనొక్కడినే' 50 డేస్ సెంటర్స్ లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ లో రూపొంది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం '1-నేనొక్కడినే' . ఈ చిత్రం మార్నింగ్ షో నుంచీ డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీ పెద్దల నుంచి,మేధావుల నుంచి ఈ చిత్రానికి ప్రశంసల వర్షం కురిసింది. పిభ్రవరి 28 కి ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే కేవలం 8 సెంటర్లలలో మాత్రమే ఇది 50 డేస్ పూర్తి చేయగలిగింది. ఇది మహేష్ గత చిత్రాల ఫలితాలతో పోలిస్తే చాలా ఆశ్చర్యకరమైనది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

ఆ సెంటర్లు.. లిస్ట్..

నైజాం:
హైదరాబాద్ - సుదర్శన్ 35 MM

సీడెడ్:
తిరుపతి - సంధ్య

కృష్ణా:
విజయవాడ - అన్నపూర్ణ

వైజాగ్:

వైజాక్ - వెంకటేశ్వర

తూర్పు గోదావరి:

కాకినాడ - శ్రీ ప్రియ
రాజమండ్రి - కుమారి

తాటిపాక - పద్మ ప్రియ

పశ్చిమ గోదావరి:
ఏలూరు - సత్యనారాయణ మినీ

ఇక మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో రాక్ స్టార్ గా నటించిన చిత్రం '1-నేనొక్కడినే'. మోడల్ కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించగా సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఫస్ట్ టైమ్ దేవిశ్రీ ప్రసాద్ మహేష్ సినిమాకు సంగీతం సమకూర్చాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా క్లాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

English summary
1-Nenokkadine is about to complete its 50 days run on Feb 28 and and it has achieved it in just 8 centres in Andhra Pradesh. This is the least count for a Mahesh Babu’s flick in the recent past.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu