»   » ‘అ..ఆ’ మూవీకి టెర్రిఫిక్ ఓపెనింగ్స్, వివరాలు...

‘అ..ఆ’ మూవీకి టెర్రిఫిక్ ఓపెనింగ్స్, వివరాలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'అ..ఆ' మూవీ ఎవరూ ఊహించని విధంగా టెర్రిఫిక్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. సాధారణంగా తెలుగులో భారీ ఓపెనింగ్స్ అంటే టాప్-5లో ఉన్న నెం.1 కేటగిరీ స్టార్ హీరోల సినిమాలకే సాధ్యం. కొన్ని సార్లు నెం.2 కేటగిరీ హీరోల సినిమాలకు త్రివిక్రమ్ లాంటి స్టార్ దర్శకుల పాపులారిటీ కూడా తోడై భారీ ఓపెనింగ్స్ వస్తాయి. తాజాగా 'అ..ఆ' సినిమా విషయంలో అదే జరిగింది.

తొలి రోజు 'అ..ఆ' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దాదాపుగా రూ. 5.5కోట్ల తొలిరోజు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇది అంత పెద్ద మొత్తం కాక పోయినా.... నితిన్ సినిమా విషయంలో ఇది టెర్రిఫిక్ ఓపెనింగ్సే అని చెప్పక తప్పదు.

nitin

మరో వైపు ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా ప్రాంతాల్లో కూడా ఈ సినిమా తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. దాదాపు 1.25 కోట్ల వరకు వసూలు చేసింది. ఓవర్సీస్ లో ఈ చిత్రం ప్రీమియర్ షోలతోనే 2.5 లక్షల డాలర్లు... మన కరెన్సీ లెక్క ప్రకారం 1.75 కోట్లు వసూలు చేసింది. త్రివిక్రమ్ సినిమాకు యూఎస్ఏలో మంచి ఆదరణ ఉండటమే ఇందుకు కారణం.

ప్రీమియర్ షోలతో కలుపుకుని తొలి రోజు కలెక్షన్స్ రూ. 9 కోట్లు పై చిలుకు వసూలు అయ్యాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ 'శుక్ర, శని, ఆది' వారాల్లో కలెక్షన్లు మరింత భారీగా ఉంటాయని అంటున్నారు. సినిమాకు టాక్ బావుండటంతో వీకెండ్ తర్వాత థియేటర్లు కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు.

English summary
A..Aa movie Day 1 collections in Andhra and Telangana are around Rs 5.5 Cr. This is nothing but terrific for a Nithin starrer movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu