»   » దంగల్‌తో కుమ్మేశాడు.. అమీర్ సంపాదించింది ఎంతో తెలుసా!

దంగల్‌తో కుమ్మేశాడు.. అమీర్ సంపాదించింది ఎంతో తెలుసా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటనలోనే కాదు సంపాదనలోనూ అమీర్‌ఖాన్ మిస్టర్ ఫర్ఫెక్ట్. ఇటీవల కాలంలో అమీర్ పట్టిందల్లా బంగారమే. ఆయన నటించిన పీకే చిత్రం భారతీయ సినిమా పరిశ్రమలోనే రికార్డు స్థాయిలో రూ.792 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో నిర్మాతలకు అత్యంత నమ్మకమైన నటుల్లో అమీర్ ఖాన్ ఒకరు అంటే సందేహమే అక్కర్లేదు. ఆయన ఓ చిత్రం నటిస్తే భారీగానే రెమ్యూనరేషన్ తీసుకొంటారనడంలో అతిశయోక్తి లేదు.

 అమీర్ సంపాదన రూ.175

అమీర్ సంపాదన రూ.175

ఇటీవల వచ్చిన దంగల్ చిత్రం దాదాపు నికరంగా రూ.532 కోట్లు లాభాన్ని ఆర్జించింది. ఈ చిత్రాన్ని డిస్నీ యూటీవీతో కలిసి అమీర్ ఖాన్ నిర్మించారు. ఈ చిత్రానికి ఆయన సంపాదించిన ఆదాయం దాదాపు రూ.175 కోట్లు అని తెలుస్తున్నది.

యూటీవీ డిస్నీతో కలిసి

యూటీవీ డిస్నీతో కలిసి

అమీర్‌ఖాన్ రూ.175 కోట్లు సొంతంగా సంపాదించారు. డిస్నీ యూటీవీతో కలిసి ఆదాయాన్ని పంచుకొన్నారు అని చిత్ర పరిశ్రమకు చెందిన ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.

33 శాతం వాటా.. 35 కోట్లు

33 శాతం వాటా.. 35 కోట్లు

చిత్రంలో నటించే ముందు అమీర్ రూ.35 కోట్లు తీసుకొంటారు. ఆ తర్వాత ప్రతీ చిత్రానికి పార్ట్‌నర్ షిప్ కింద ఆదాయంలో 33 శాతం వాటాను స్వీకరిస్తారు. ఇక ముందు నటించే చిత్రాల్లో రాయల్టీ కింద శాటిలైట్ రైట్స్ తో కలిపి సినిమా వసూళ్లలో 33 శాతం వాటా తీసుకొనే విధంగా ఒప్పందం చేసుకొన్నారట.

సీక్రెట్ సూపర్‌స్టార్

సీక్రెట్ సూపర్‌స్టార్

దంగల్ చిత్రం తర్వాత అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. సీక్రెట్ సూపర్‌స్టార్ ఆగస్టు 4న, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం 2018 దీపావళికి విడుదల కానున్నది. ఆ తర్వాత జాన్ మాథ్యువ్ దర్శకత్వంలో రూపొందే సర్ఫరోష్ 2 చిత్రంలో నటిస్తారు.

English summary
Dangal has grossed Rs 532.56 crore. Aamir Khan himself has earned a humongous Rs 175 crore (approx)
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu