»   » అల్లరి నరేష్ 'యాక్షన్ 3D' కలెక్షన్స్ పరిస్థితి ఏంటి?

అల్లరి నరేష్ 'యాక్షన్ 3D' కలెక్షన్స్ పరిస్థితి ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లరి నరేష్ తాజా చిత్రం 'యాక్షన్ 3D'. అనీల్ సుంకర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓపినింగ్స్ బాగానే రాబట్టుకున్నా...మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ రావటం మైనస్ గా మారింది. దాంతో వీకెండ్స్ లో కూడా అల్లరి నరేష్ రెగ్యులర్ చిత్రాలకు వచ్చే కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ టాక్. అలాగే సోమవారం నుంచి కలెక్షన్స్ చాలా చోట్ల పూర్తిగా డ్రాప్ అయ్యాయని తెలుస్తోంది.

అప్పటికీ ఈ చిత్రం సెండాఫ్‌లో కొన్ని సీన్లు బోరింగ్‌, చెత్తగా ఉండటంతో....సినిమాను రక్షించుకునే ప్రయత్నంలో పడ్డ దర్శక నిర్మాతలు కొన్ని సీన్లను కత్తిరించాలని డిసైడ్ అయ్యారు. దీంతో సెకండాఫ్‌లో సినిమా దాదాపు 15 నిమిషాల పాటు ట్రిమ్ చేయబడింది. అయినా ఈ కత్తిరింపుల వ్యవహారం సినిమాకు పెద్దగా కలిసిరాలేదు.

అల్లరి నరేష్ హీరోగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందించారు. రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కెమెరా : సర్వేష్ మురారి, 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

English summary
Action 3D, the first 3D film in Telugu, took superb openings on its first day. Though collections are pretty good, the general talk was that it is too Bad. Seeing the public response, the team has immediately decided to chop off unnecessary scenes in the second half of the film. About 15 minutes of the movie has been trimmed. But there is no use in trimming.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu