»   » షాక్ :విజయ్ 'పులి' తెలుగు రైట్స్ రేటు ఎంతంటే

షాక్ :విజయ్ 'పులి' తెలుగు రైట్స్ రేటు ఎంతంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ స్టార్ హీరో విజయ్‌, శ్రుతిహాసన్‌, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పులి'. ఈ చిత్రం ఆడియోను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని ఎనిమిది కోట్లకు పొందినట్లు సమాచారం. ఇక్కడ ఒక్క పెద్ద హిట్ కూడా కొట్టని విజయ్ చిత్రంపై ఎనిమిది కోట్లు వెచ్చించటం అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో షాక్ కు గురి చేస్తున్న విషయం.

ఈ చిత్రం రైట్స్ ని గతంలో తుపాకి చిత్రం రైట్స్ పొందిన ఎస్ వి ఆర్ మీడియా వారు తీసుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, హన్సిక,శృతి హాసన్ హీరోయిన్స్ కావటం, శ్రీదేవి,సుదీప్ కీలకపాత్రలో ఉండటం సినిమాకు బిజినెస్ దృష్ట్యా క్రేజ్ వచ్చిందని చెప్తున్నారు.


శింబుదేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. అలనాటి అందాల తార శ్రీదేవి మహారాణిగా ప్రధాన పాత్రలో నటించడగా, కన్నడ నటుడు సుధీప్ విలన్‌గా నటించారు. పీటీ సెల్వకుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.


విజయ్ మాట్లాడుతూ... చారిత్రక కథా చిత్రంలో నటించాలన్న కోరిక ఈ పులి చిత్రంతో తీరిందన్నారు. నిర్మాతలు భారీ ఎత్తున ఖర్చు పెట్టి చిత్రాలు నిర్మిస్తుంటే కొందరు వాటిని అక్రమంగా ఇంటర్‌నెట్‌లో ప్రచారం చేస్తున్నారని.. దీంతో సినిమావాళ్ల శ్రమ మట్టిలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక బిడ్డ సుఖ ప్రసవం అయ్యే ముందే గర్భాన్ని కోసి చంపే చర్యగా ఉందన్నారు.


 About Ilayathalapathy Vijay's Puli telugu rights

ఇప్పటి వరకు యూట్యూబ్‌లో ఈ చిత్రం టీజర్‌ను దాదాపు 60 లక్షల మంది వీక్షించడం పై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నటుడు విజయ్‌ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టీజర్‌లో వీరోచిత పోరాటాలు, భారీ సెట్లు, యాక్షన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.


గతంలో ఒకరోజులో అధిక వ్యూస్ వచ్చిన టీజర్‌గా అమీర్‌ఖాన్‌ నటించిన 'పీకే' చిత్రం రికార్డు సాధించింది. అయితే ఆ రికార్డును'ఇలయ తలబది' నటించిన 'పులి' చిత్రం తిరగరాసింది. ఒక రోజులో 10 లక్షల కన్నా ఎక్కువ మంది అంటే ఇప్పటి వరకు ఈ టీజర్‌ను 12.5 లక్షల మంది వీక్షించారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఒక వారియర్ లుక్ లో కనిపించాడు. చూడడానికి డ్రెస్సింగ్ అంతా వారియర్ గెటప్ లో ఉన్నా తన హెయిర్ స్టైల్ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది. దాంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు పెరుగిపోయాయి.ఇక ఈ చిత్రంలో శ్రీదేవి ప్రత్యేక పాత్రోలో కనిపించనుంది. ఈ సినిమా గురించి నిర్మాత షిబు తమీన్స్‌ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రం 'ది గ్లాడియేటర్‌' పంథాలో ఈ సినిమా సాగుతుందట.


షిబు తమీన్స్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.

English summary
SVR Media, which earlier distributed the Telugu version of Vijay’s Thuppakki, bagged the Telugu dubbing rights of Puli for a whopping price of 8 Crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu