For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Acharya: తెలుగులోనే బిగ్గెస్ట్ డిజాస్టర్.. డైరెక్టర్, హీరోల రెమ్యునరేషన్ పోయినట్లే.. ఎంత నష్టమంటే?

  |

  మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా విడుదలకు ముందు పెద్దగా హైప్ లేకుండానే థియేటర్స్ లోకి వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా సినిమా ఆశించినంతగా ప్రభావం ఏమీ చూపించలేకపోయింది. మొదటి రోజే చాలా తక్కువ వసూళ్లను అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత రోజు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. దాదాపు సోమవారం ఈ సినిమా కలెక్షన్స్ పూర్తిగా తగ్గిపోయాయి అని తెలుస్తోంది. ఇక మొత్తంగా సినిమా తెలుగు చిత్రపరిశ్రమలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ హీరోలకు పారితోషికం కూడా వచ్చే అవకాశం లేదని సమాచారం.

  ఒక రేంజ్ లో ఉండాల్సిన సినిమా

  ఒక రేంజ్ లో ఉండాల్సిన సినిమా


  ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా అనంతరం పూర్తి స్థాయిలో కమర్షియల్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆచార్య అనే సినిమా చేశాడు. ఈ సినిమా విడుదల అవుతోంది అంటే తప్పకుండా ఒక రేంజ్ లో ఉంటుంది అని అనిపించింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి తో మొదటిసారి రామ్ చరణ్ ఒక ఫుల్ లెన్త్ పాత్రలో కనిపించడం. అంతేకాకుండా మరొకవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ సినిమా డైరెక్ట్ చేయడం కలిసొస్తుందని అనుకున్నారు.

  అదే పెద్ద మైనస్

  అదే పెద్ద మైనస్

  ఎలా చూసుకున్నా కూడా ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంటుంది అని అనుకున్నారు. కానీ ఈ సినిమా అందుకు భిన్నంగా విడుదల ముందు రోజు అసలు ఏమాత్రం హైప్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలైతే మొదట ఈ సినిమా సాంగ్స్ బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. మణిశర్మ అందించిన సంగీతం కూడా సినిమాకు పెద్ద మైనస్ అని కామెంట్స్ కూడా వచ్చాయి.

  రెండవ రోజు దారుణంగా

  రెండవ రోజు దారుణంగా

  ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 29 కోట్ల షేర్ అందుకుని పరవాలేదు అనిపించింది. కానీ సినిమాకు పూర్తిస్థాయిలో నెగిటివ్ టాక్ రావడంతో రెండవ రోజు కలెక్షన్స్ ఒక్కసారిగా డోన్ అయ్యాయి. అసలు కలలో కూడా ఊహించని విధంగా రెండో రోజు ఐదు కోట్ల షేర్ మాత్రమే రావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

   బిగ్ టార్గెట్

  బిగ్ టార్గెట్

  ఆచార్య సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి వచ్చింది. తప్పకుండా ఈ టార్గెట్ ను ఈజీగా బ్రేక్ చేస్తారు అని అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాకుండా రామ్ చరణ్ కూడా సినిమాలో 40 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపించడం కూడా ఈ సినిమాకు కలిసి వస్తుంది అనుకున్నారు. కానీ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. ఫైనల్ 2 అయితే 50 కోట్లను అందుకుంటుందా లేదా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.

  సోమవారం డౌటే

  సోమవారం డౌటే

  మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల వరకు షేర్ సాధించినట్లు తెలుస్తోంది. విడుదలైన రోజు శనివారం ఒక్కసారిగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఆదివారం అయితే కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. చూస్తుంటే ఈ వీకెండ్ అనంతరం సినిమా హడావిడి ముగిసినట్లే అని.. చాలా వరకు థియేటర్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

  80 కోట్ల నష్టాలు..?

  80 కోట్ల నష్టాలు..?

  ఫైనల్ గా ఆచార్య సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లను అందుకుంటుంది అని అనుకుంటే ఇప్పుడు అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాగా నిలవబొతున్నట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమా దాదాపు 80 కోట్ల నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  డిస్ట్రిబ్యూటర్స్ ఆవేదన

  డిస్ట్రిబ్యూటర్స్ ఆవేదన


  ఇక ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్స్ నష్టాల నుంచి ఆదుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోలు నటించిన మల్టీస్టారర్ కాబట్టే మార్కెట్ ఉండటంతో మొదట షూటింగ్ అవ్వకముందే డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు సినిమా ను కొనుగోలు చేశారు. ఇక ఇప్పుడు భారీ నష్టాల దిశగా కొనసాగుతుండడంతో నష్ట పరిహారం చెల్లించేందుకు కృషి చేయాలి అనే డిస్ట్రిబ్యూటర్స్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

  రెమ్యునరేషన్ లేనట్లే?

  రెమ్యునరేషన్ లేనట్లే?

  అయితే ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఇద్దరు హీరోలు అలాగే దర్శకుడు కొరటాల శివ కూడా వర్క్ చేసినట్లుగా నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలియజేసిన విషయం తెలిసిందే. ఇక కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ ఈ నష్టాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాతను మళ్లీ పారితోషికం గురించి ప్రస్తావించే అవకాశం లేకుండా పోయినట్లుగా తెలుస్తోంది.

  English summary
  Acharya movie going to be biggest disaster movie in telugu cinema
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X