అనుష్క శెట్టి టాప్ 5 చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు.. స్విటీ చేతిలో ఆల్ టైమ్ రికార్డు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఘాటి. ఈ చిత్రానికి టాప్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఫీమేల్ సెంట్రిక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్రహ్మాండమైన స్పందనను దక్కించుకుంది. అయితే అనుష్క శెట్టి టాప్ 5 గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రాల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
అనుష్క శెట్టి నటించిన చిత్రాల్లో టాప్ 5 గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రాల వివరాల్లోకి వస్తే.. టాప్ 5లో ఓం నమో వెంకటేశాయ చిత్రం ఉంది. అక్కినేని నాగార్జునతో కలిసి నటించింది. 2017లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.20 కోట్లు మాత్రమే వసూల్ చేసింది. ఈ సినిమా ఫ్లాప్ గానూ నిలిచింది. ఇక అంతకు ముందు వచ్చి సైజ్ జీరో చిత్రం రూ.23 కోట్లు వసూల్ చేసింది. యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

అనుష్క శెట్టి ఫీమేల్ సెంట్రిక్, హిస్టారికల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా భాగమతి, ఈ చిత్రం రూ.67.20 కోట్ల గ్రాస్ ను బాక్సాఫీస్ నుంచి రాబట్టగలిగింది. ఈ చిత్రం అనుష్క శెట్టి చివరి ఐదు చిత్రాల్లో 4వ చిత్రమిది. ఇక తమిళంలో అనుష్క శెట్టి నటించిన సింగం 3 చిత్రం హిట్ టాక్ అందుకుంది. తమిళ స్టార్ సూర్య సరసన నటించి మెప్పించింది. దీంతో చిత్రానికి బాక్సాఫీస్ వద్ద రూ.136 కోట్ల గ్రాస్ వసూలైంది. అనుష్క శెట్టి నటించిన చిత్రాల్లో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది.
అలాగే చివరిగా 2023లో అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం హిట్ టాక్ ను అందుకుంది. మిడియం బడ్జెట్ తో ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లను అందించింది. ఇక 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. అనుష్క శెట్టి కెరీర్ లోనే కలెక్షన్ల పరంగా ఆల్ టైమ్ రికార్డును అందుకుంది. రూ.1810.60 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.
ఇక ప్రస్తుతం అనుష్క శెట్టి నటించిన ఘాటి చిత్రం బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ 5న ఖాతా ఓపెన్ చేసింది. దీంతో ఈ చిత్రం ఓపెనింగ్ డే 15 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూల్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం బాక్సాఫీస్ 100 కోట్ల గ్రాస్ వసూల్ చేస్తే లాభాల్లోకి రానుంది.


Click it and Unblock the Notifications











