»   » ఎన్టీఆర్ 'బృందావనం' ఆడియో రైట్స్ ఎంత పలికాయంటే...

ఎన్టీఆర్ 'బృందావనం' ఆడియో రైట్స్ ఎంత పలికాయంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మించిన బృందావనం చిత్రం ఆడియో పంక్షన్ క్రిందటి ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ఆడియోని ఆదిత్యా మ్యూజిక్ వారు తీసుకున్నారు. వీరు 55 లక్షల రూపాయలకు ఈ ఆడియోను పోటీలో సొంతం చేసుకున్నట్లు సమాచారం. తమస్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇంత పలకటానికి కారణం కేవలం జూ.ఎన్టీఆర్ మాత్రమే అంటున్నారు. దిల్ రాజు గత చిత్రాల కన్నా ఈ చిత్రం ఆడియో ఎక్కువ రేటుకు పోవటం ఆయనకు శుభసూచికంలా కన్పించిందని చెప్తున్నారు. అక్టోబర్ 8న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, కాజల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందించన ఈ చిత్రం ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆడియోకు మంచి పేరే వచ్చింది కాబట్టి ఆదిత్యా మ్యూజిక్ వారు హ్యాపీగా ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu