For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Major Closing Collections: 19 కోట్ల టార్గెట్.. టోటల్‌ కలెక్షన్లు ఇలా.. మహేశ్‌కు అన్ని కోట్ల లాభం

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకమైనవిగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' ఒకటి. ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.

  ఫలితంగా దేశ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్ల వర్షం కురిసి లాభాల పంట పండించింది. ఈ నేపథ్యంలో 'మేజర్' మొత్తం కలెక్షన్ల రిపోర్టును చూద్దాం పదండి!

   మేజర్‌గా ఎంట్రీ ఇచ్చిన అడివి శేష్

  మేజర్‌గా ఎంట్రీ ఇచ్చిన అడివి శేష్

  అడివి శేష్ హీరోగా శశి కిరణ తిక్కా తెరకెక్కించిన చిత్రమే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేయగా.. ప్రకాశ్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు చేశారు.

  తెలుగు పిల్ల అనన్య నాగళ్ల పరువాల విందు: వామ్మో ఆమెనిలా చూశారంటే!

  భారీ అంచనాలతో బిజినెస్ ఇలా

  భారీ అంచనాలతో బిజినెస్ ఇలా

  స్టార్ హీరో మహేశ్ బాబు నిర్మాణంలో అడివి శేష్ నటించిన 'మేజర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడైంది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ అయింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 18 కోట్ల మేర బిజినెస్ అయింది.

  పాజిటివ్ టాక్... కలెక్షన్ల సునామీ

  పాజిటివ్ టాక్... కలెక్షన్ల సునామీ

  వీర జవాన్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'మేజర్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అదే ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభావాన్ని చూపించింది. దీంతో అన్ని ఏరియాల్లోనూ దీనికి కలెక్షన్లు సునామీ సృష్టించింది.

  సుమ షోలో యంగ్ హీరోకు అవమానం: మొబైల్ విసిరేసిన యాంకర్.. కోపంతో వెళ్లిపోయిన స్టార్ కిడ్

  తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది

  తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది

  ఆంధ్రా, తెలంగాణలో 'మేజర్' ఫుల్ రన్‌లో బాగా రాణించింది. నైజాంలో రూ. 8.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.29 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.43 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 92 లక్షలు, గుంటూరులో రూ. 1.18 కోట్లు, కృష్ణాలో రూ. 1.13 కోట్లు, నెల్లూరులో రూ. 69 లక్షలతో.. ఓవరాల్‌గా రూ. 17.85 కోట్లు షేర్, రూ. 29.80 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

   ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

  ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

  ముగింపు సమయానికి ఏపీ, తెలంగాణలో రూ. 17.85 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్'.. అన్ని ప్రాంతాల్లో హవాను చూపించింది. ఇక, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.30 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 6.30 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 33.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

  జబర్ధస్త్ వర్ష అందాల ఆరబోత: ఉల్లిపొరలాంటి చీరలో అదిరిపోయే హాట్ ట్రీట్

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

  ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'మేజర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో ఈ సినిమాకు రూ. 33.35 కోట్లు వచ్చాయి. ఫలితంగా క్లీన్ హిట్ స్టేటస్‌‌తో పాటు మహేశ్ బాబుకు రూ. 14.35 కోట్ల లాభాలు కూడా సొంతం అయ్యాయి.

  నెట్‌ఫ్లిక్స్‌లోనూ హవా చూపిస్తూ

  నెట్‌ఫ్లిక్స్‌లోనూ హవా చూపిస్తూ

  అడివి శేష్ - శశి కిరణ్ తిక్కా కాంబినేషన్‌లో రూపొందిన 'మేజర్' మూవీ థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రాన్ని జూలై 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అక్కడ కూడా దీనికి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇండియాలోనే ఈ సినిమా టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఇలా కూడా ఈ మూవీ హవా చూపిస్తోంది.

  English summary
  Tollywood Young Hero Adivi Sesh did Major Movie Under Sashi Kiran Tikka Direction. This Movie Collect 33.35 Cr in Full Run.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X