»   » అలనాటి తార శ్రీదేవికి షాకివ్వబోతున్న....‘భాగమతి’ అనుష్క?

అలనాటి తార శ్రీదేవికి షాకివ్వబోతున్న....‘భాగమతి’ అనుష్క?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పటితో పోలిస్తే ఇండియన్ సినిమా మార్కెట్ పరిధి చాలా విస్తరించింది. కేవలం దేశంలోపలే కాదు.... విదేశాల్లోనూ మన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఇండియా తర్వాత భారతీయ సినిమాలకు ప్రధాన మార్కెట్ యూఎస్ఏ. తాజాగా విడుదలైన తెలుగు చిత్రం 'భాగమతి' యూఎస్ఏలో ఊహించని వసూళ్లు సాధిస్తోంది.

యూఎస్ఏలో భాగమతి కలెక్షన్స్

యూఎస్ఏలో భాగమతి కలెక్షన్స్

సాధారణంగా యూఎస్ఏ మార్కెట్లో అగ్ర హీరోలదే ఆధిపత్యం. అయితే స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడుతూ కథానాయిక ప్రధాన చిత్రం 'భాగమతి' 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.

భాగమతి కలెక్షన్లు చూసి పరేషాన్, హీరోలకు ఏమాత్రం తీసిపోలేదు
 శ్రీదేవి రికార్డు బద్దలు కొట్టే దిశగా

శ్రీదేవి రికార్డు బద్దలు కొట్టే దిశగా

రెండో వారంలోనూ ‘భాగమతి' చిత్రం మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. త్వరలోనే ఈ చిత్రం శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.

 లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అదే టాప్

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అదే టాప్

యూఎస్ఏ ఇండియన్ బాక్సాఫీసు వద్ద అగ్రహీరోల సినిమాలదే ఆధిపత్యం. అక్కడి ఇప్పటి వరకు 1 మిలియన్ మార్కు దాటిన లేడీ ఓరియెండెట్ చిత్రం ‘ఇంగ్లిష్ వింగ్లిష్' మాత్రమే. శ్రీదేవి క్రేజ్ కారణంగా అప్పట్లో ఆ చిత్రం 1.85 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. త్వరలోనే ఈ రికార్డును అనుష్క ‘భాగమతి' బద్దలు కొట్టబోతోందని అంటున్నారు.

వరల్డ్ వైడ్ భాగమతి వసూళ్లు

వరల్డ్ వైడ్ భాగమతి వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో భాగమతి చిత్రం ఇప్పటి వరకు రూ. 28.5 కోట్ల గ్రాస్, రూ. 17.95 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 58.9 కోట్ల గ్రాస్, రూ. 30.9 కోట్ల షేర్ ను రాబట్టింది. ఒక్క నైజాంలోనే ఈ సినిమా 11కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం.

English summary
Anushka Shetty starrer has crossed the coveted $ 1 Million mark at the USA Box Office. It's a remarkable feat considering that except for Sridevi's 2012 hit English Vinglish, none of the heroine oriented films have managed to open the $ 1 Million in the US markets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu