»   » వీడియో: ఐష్ 'అడ్వకేట్ అనురాధ వర్మ' ట్రైలర్..విత్ రిలీజ్ డేట్

వీడియో: ఐష్ 'అడ్వకేట్ అనురాధ వర్మ' ట్రైలర్..విత్ రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్: బాలివుడ్ లో రీసెంట్ గా విడుదలైన ఐశ్వర్యారాయ్ 'జబ్బా' చిత్రం తెలుగులో 'అడ్వకేట్ అనురాధ వర్మ'గా తెలుగులో డబ్బింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నవంబర్ 6 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. 

ఇక చిత్రం కథేమిటంటే...

సింగిల్ మదర్ అనురారాధ వర్మ (ఐశ్వర్యరాయ్)కి సనాయా (అసారా అర్జున్) అనే పాప. ప్రొఫెషనల్ గా ఆమె సక్సెస్ ఫుల్ క్రిమినల్ లాయర్. ఓ రోజు అనురాధ వర్మ కూతురు సనాయా కిడ్నాప్ కు గురవుతుంది. పాపను విడిచిపెట్టాలంటే... రేపిస్టు, హంతుకుడు అయిన మియాజ్ షేక్(చందన్ రాయ్ సన్యాల్)ను నాలుగు రోజుల్లో జైలు నుండి బయటకు తీసుకురావాలని బెదిరిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిజాయితీగల లాయర్ గా.... ఓ వైపు నిస్సహాయురాలైన తల్లిగా ఆమె ఈ పరిస్థితిని ఎలా ఫేస్ చేసింది అనేది తెరపై చూడాల్సిందే.

Aishwarya Rai's Advocate Anuradha Varma Movie Theatrical Trailer

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తన కూతురును రక్షించుకోవడంలో ఆమెకు తన బెస్ట్ ఫ్రెండ్, ఇన్స్ స్పెక్టర్ యోహాన్ (ఇర్ఫాన్ ఖాన్) సహకరిస్తాడు. అప్పటికే అతను సస్పెన్షన్ లో ఉంటాడు. అయితే తన వల్ల అయిన సహాయం చేస్తాడు. ఈ క్రమంలో వీరు హియాజ్ షేక్ వల్ల హత్యకు, అత్యాచారినికి గురైన బాధితురాలి తల్లి(షబానా అజ్మి)ని కలుస్తారు. మరిన్ని వివరాలు సేకరిస్తారు. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది.

Aishwarya Rai's Advocate Anuradha Varma Movie Theatrical Trailer

ఐశ్వర్యారాయ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. ఐదేళ్ల తర్వాత మళ్లీ తెర ముందుకు వచ్చినా ఆమె నటనలో ఏ మాత్రం పదును తగ్గ లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ఐష్ పోషించిన క్రిమినల్ లాయర్ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇర్ఫాన్ ఖాన్ తనదైన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకున్నాడు. షబానా అజ్మీ, జాకీష్రాఫ్, సిద్ధాంత్ కపూర్ తమ తమ పాత్రల్లో ఎఫెక్టివ్ గా నటించారు.

సినిమా స్టోరీ యూనిక్ గా ఉంది. అయితే కథ ఈ విషయంలో దర్శకుడికి పెద్దగా క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొరియన్ ఫిల్మ్ ‘సెవెన్ డేస్' చిత్రానికి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. అయితే ఇండియన్ ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా దర్శకుడు సినిమాను తెరకెక్కించడంలో సఫలం అయ్యాడు. అయితే ఎమోషన్ సీన్స్ కాస్త ఓవర్ గానే చూపించారని చెప్పొచ్చు. క్లైమాక్స్ బావుంది.

English summary
"Jazbaa" film is now getting dubbed into Telugu as 'Advocate Anuradha Varma' and will be released soon. Jazbaa starring Aishwarya Rai Bachchan was one of the most talked about film this year!
Please Wait while comments are loading...