Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Thunivu Collection: అజిత్ బ్యాంక్ రాబరీకి ఫిదా.. గత రెండు రోజులకు మించిన కలెక్షన్స్.. ఆ రికార్డుకు దగ్గరిగా!
తమిళ స్టార్ హీరో అజిత్ తన యాక్షన్ స్టంట్స్ తో అదరగొడుతుంటాడు. దాదాపుగా రియల్ స్టంట్స్ చేస్తూ అభిమానులుక ఐ ట్రీట్ ఇస్తుంటాడు తలా అజిత్. ఇటీవల నేర్కొండ పార్వై (హిందీ పింక్ రీమేక్), వలిమై చిత్రాలతో అభిమానులను పలకరించిన అజిత్ తాజాగా తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు గత రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ తెరకెక్కించడం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అజిత్ తునివు 12వ రోజుతోపాటు రెండు వారాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా!

ఫ్యాన్స్ ముద్దుగా తలా
కోలీవుడ్
స్టార్
హీరో
అజిత్
ను
ఆయన
ఫ్యాన్స్
ముద్దుగా
తలా
అని
పిలుచుకుంటారు.
ఆయన
తెలుగులో
కూడా
కొంతమేర
అభిమానులను
సంపాదించుకున్నాడు.
అందుకే
ఆయన
సినిమాలు
తెలుగులోనూ
అప్పుడ్పుడు
విడుదలై
సందడి
చేస్తుంటాయి.
ఈ
క్రమంలోనే
అజిత్
నటించిన
తాజా
సినిమా
తెగింపు.
గత
రెండు
చిత్రాలకు
నిర్మాతగా
వ్యవహరించిన
బోనీ
కపూర్
ఈ
సినిమాకు
కూడా
నిర్మాత
బాధ్యతలు
చేపట్టారు.
అజిత్-వినోద్-బోనీ
కపూర్
కాంబినేషన్
లో
వరుసగా
వచ్చిన
మూడో
చిత్రమే
తెగింపు.

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
తెగింపు సినిమాకు తలా అజిత్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు, తమిళనాడులో రూ. 58 కోట్లు, కర్ణాటక రాష్ట్రంలో రూ. 3.60 కోట్లు, కేరళలో రూ. 2.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్ రూ. 15 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 84 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెగింపు చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను సాధించాలంటే రూ. 85 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి.

12వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు..
జిబ్రాన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన చిత్రం తునివు. తెలుగులో డబ్బింగ్ చిత్రంగా తెగింపు టైటిల్ తో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. అజిత్ తెగింపు చిత్రం 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 7 లక్షలు వసూలు చేసింది. అంటే గత రెండు రోజుల్లో రూ. 6 లక్షలు రాగా ఆదివారం రోజు ఒక లక్ష అధికంగా వసూలు అయింది. ఇక 12 రోజుల్లో నైజాంలో రూ. 1.76 కోట్లు, సీడెడ్ రూ. 51 లక్షలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం రూ. 1.78 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 2 వారాల్లో ఏపీ తెలంగాణలో రూ. 4.05 కోట్లు గ్రాస్ గా, రూ. 2.07 కోట్లు షేర్ నమోదైంది.

12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా..
కోలీవుడ్ స్టార్ నటి మంజు వారియర్ యాక్షన్ సీక్వెన్స్ తో అలరించిన తెగింపు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా టాక్ బాగానే ఉంటోంది. ఫలితంగా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.05 కోట్లు, తమిళనాడులో రూ. 103.20 కోట్లు, కర్ణాటకలో రూ. 12.65 కోట్లు, కేరళ రాష్ట్రంలో రూ. 3.75 కోట్లు కలెక్ట్ చేయగా.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.90 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 51.45 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ. 177 కోట్లు గ్రాస్, రూ. 91.76 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది.

ప్రాఫిట్ ఎంతంటే..
అజిత్-హెచ్ వినోద్-బోనీ కపూర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన తెగింపు క్లీన్ హిట్ కొట్టేసింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 84 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 85 కోట్లుగా ఫిక్స్ అయింది. అజిత్ తునివు చిత్రం 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 91.76 కోట్లు వసూళు చేసింది. కాబట్టి, అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాగా రూ. 6.76 కోట్లు లాభంతో క్లీన్ హిట్ గా నిలిచింది అజిత్ తెగింపు చిత్రం.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..
మాస్ యాక్షన్ స్టంట్స్, బైక్ చేజింగ్స్ తో ఆద్యంతం అలరించే కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ తెగింపుకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 3.50 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 12 రోజుల్లో రూ. 2.07 కోట్లు కొల్లగొట్టగా.. మరో రూ. 1.43 కోట్లు వసూళ్లు రాబట్టగలిగితే ఇక్కడ కూడా క్లీన్ హిట్ స్టేటస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 91.76 కోట్ల షేర్ సాధించగా.. మరో రూ. 9 కోట్లు వస్తే రూ. వంద కోట్లు కొల్లగొట్టినట్లు అవుతుంది.