Don't Miss!
- News
పోస్టింగ్ కోసం సోమేష్ కుమార్ ఎదురు చూస్తోన్న వేళ- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Thunivu Collection: దూసుకుపోతున్న అజిత్ తెగింపు.. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు చేరువగా?
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ తాజాగా నటించిన చిత్రం తెగింపు (తమిళంలో తునివు). ప్రముఖ హిందీ చిత్రపరిశ్రమ నిర్మాత బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. అజిత్-వినోద్-బోనీ కపూర్ కాంబినేషన్ లో వరుసగా వచ్చిన మూడో చిత్రమే తెగింపు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఎలాంటి అంచనాలు, ప్రమోషన్స్ లేకుండా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా వారం రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

బ్యాంక్ దొంగతనం..
యాక్షన్ డ్రామాగా వచ్చిన అజిత్ తాజా చిత్రం తెగింపులో ఫీమెల్ లీడ్ గా మంజు వారియల్ నటించగా సముద్ర ఖని, వీర, జాన్ కొక్కెన్, అజయ్, సీబీ చంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 11న విడుదలైన ఈ సినిమా మొదట్లో పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. కానీ తర్వాత క్రమంగా వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. బ్యాంక్ దొంగతనం వంటి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
తలా
అజిత్
లేటెస్ట్
మూవీ
తెగింపుకు
అతనికి
ఉన్న
మార్కెక్ట్
ను
బట్టే
ప్రీరిలీజ్
బిజినెస్
జరిగింది.
తమిళనాడులో
రూ.
58
కోట్లు,
తెలుగు
రాష్ట్రాల్లో
రూ.
3.20
కోట్లు,
కర్ణాటక
రాష్ట్రంలో
రూ.
3.60
కోట్లు,
కేరళలో
రూ.
2.50
కోట్లు,
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
1.70
కోట్లు,
ఓవర్సీస్
రూ.
15
కోట్లు
కాగా
ప్రపంచవ్యాప్తంగా
మొత్తం
రూ.
84
కోట్ల
ప్రీ
రిలీజ్
బిజినెస్
చేసినట్లు
ట్రేడ్
వర్గాలు
చెబుతున్నాయి.
దీంతో
తెగింపు
చిత్రం
బ్రేక్
ఈవెన్
టార్గెట్
ను
సాధించాలంటే
రూ.
85
కోట్లు
రాబట్టాలి.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్..
అజిత్ మరోసారి తన యాక్షన్ తో అదరగొట్టన చిత్రం తునివు. తెలుగులో డబ్బింగ్ చిత్రంగా తెగింపు టైటిల్ తో విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్లు పర్వాలేదనిపిస్తోంది. అజిత్ తెగింపు చిత్రం 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 18 లక్షలు వసూలు చేసింది. ఇక ఏడు రోజుల్లో నైజాంలో రూ. 1.60 కోట్లు, సీడెడ్ రూ. 45 లక్షలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం రూ. 1.61 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక వారం రోజుల్లో ఏపీ తెలంగాణలో రూ. 3.66 కోట్లు గ్రాస్ గా, రూ. 1.87 కోట్లు షేర్ నమోదైంది.

7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చింది..
మంజు వారియర్ ఎన్నడూ చేయని విధంగా యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించిన తలా అజిత్ తెగింపు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ వస్తోంది. ఫలితంగా ఏడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.66 కోట్లు, తమిళనాడులో రూ. 84.45 కోట్లు, కర్ణాటకలో రూ. 10.30 కోట్లు, కేరళ రాష్ట్రంలో రూ. 3.40 కోట్లు కలెక్ట్ చేయగా.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.75 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 45.60 కోట్లు కలెక్షన్స్ సాధించింది. దీంతో వరల్డ్ వైడ్ గా రూ. 77.63 కోట్ల షేర్, రూ. 149.16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ చిత్రం.

రావాల్సింది ఎంతంటే..
అజిత్-హెచ్ వినోద్ కాంబినేషన్ లో మూడోసారి విడుదలైన తెగింపు సినిమా హ్యాట్రిక్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 84 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 85 కోట్లుగా ఫిక్స్ అయింది. అజిత్ తునివు చిత్రం ఏడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 77.63 కోట్లు వసూళు చేసింది. కాబట్టి.. రూ. 7.37 కోట్లు వస్తే ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ కోసం..
తన
మాస్
యాక్షన్
స్టంట్స్
తో
ఆద్యంతం
అలరించే
కోలీవుడ్
స్టార్
హీరో
తలా
అజిత్
నటించిన
లేటెస్ట్
సినిమా
తెగింపుకు
తెలుగు
రాష్ట్రాల్లో
రూ.
3.20
కోట్లు
బిజినెస్
జరిగింది.
దీంతో
రూ.
3.50
కోట్లుగా
బ్రేక్
ఈవెన్
టార్గెట్
నమోదైంది.
ఈ
సినిమా
ఆంధ్రప్రదేశ్,
తెలంగాణలో
వారం
రోజుల్లో
రూ.
1.87
కోట్లు
కొల్లగొట్టగా..
మరో
రూ.
1.63
కోట్లు
వసూళ్లు
సాధిస్తే
ఇక్కడ
కూడా
క్లీన్
హిట్
స్టేటస్
సొంతం
చేసుకోనుంది.