»   » అజిత్ 'ఆరంభం' హిందీ రీమేక్...డిటేల్స్

అజిత్ 'ఆరంభం' హిందీ రీమేక్...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : దక్షిణాది బాషలో ఒక సినిమా హిట్టైందంటే బాలీవుడ్ హీరోలు దాని రీమేక్ రైట్స్ కోసం వాలిపోతున్నారు. తాజాగా అదే పరిస్ధితి ఆరంభం కు కనిపిస్తోంది. అజిత్,నయనతార కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ పోటీ పడుతోందని సమాచారం. ముఖ్యంగా అక్షయ్ కుమార్ ఈ చిత్రం రైట్స్ ఎట్టి పరిస్ధితుల్లోనూ సొంతం చేసుకోవాలని ఉత్సాహపడి పోటీలో ఉన్నారు. నిర్మాత ఎ.ఎం రత్నంతో బాలీవుడ్ కి చెందిన ఓ పెద్ద నిర్మాణ సంస్ధ టాక్స్ జరుపుతోందని తెలుస్తోంది.

బాలీవుడ్‌ కథలపై కోలీవుడ్‌, టాలీవుడ్ దర్శకులు, హీరోలు మోజు ప్రదర్శించటం ఒకప్పటి మాట. తెలుగు,తమిళ,మళయాళ కథలతో బాలీవుడ్‌లో కాసుల వర్షాలు కురిపించుకోవటం నేటి ట్రెండ్‌. అలా బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విక్రమార్కుడు కథను 'రౌడీ రాథోడ్‌'గా తెరకెక్కించుకుని రూ.వంద కోట్లకు పైగా వసూలు చేశాడు. ప్రస్తుతం విజయ్‌ తుపాకీ రీమేక్‌లో నటిస్తూ, గతంలో విజయకాంత్‌ నటించిన రమణ రీమేక్‌ 'గబ్బర్‌'లో నటించేందుకు అంగీకరించిన అక్షయ్‌కుమార్‌ ప్రస్తుతం అజిత్‌ తాజా బ్లాక్‌బస్టర్‌పై కన్నేశాడు.

దీపావళి కానుకగా విడుదలైన ఆరంభం అద్భుత కలెక్షన్‌లు సాధిస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పే దిశగా పరుగులు పెడుతోంది. సినిమాను చూసిన అక్షయ్‌కుమార్‌ ఆరంభం హిందీ రీమేక్‌లో నటించాలని ఫిక్సయ్యాడట. ఆరంభం కథ బాలీవుడ్‌లోనూ సరితూగేదనని, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా చిన్నపాటి మార్పులు చేసుకుని నటించాలని ఉన్నాడట. దర్శకుడు ఎవరైతే భాగుంటుందనే విషయంలో అక్షయ్‌కుమార్‌ తలమునకలై ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా విష్ణువర్థన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'ఆరంభం'. అత్యంతభారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమా ఇటీవల అక్కడ విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం హక్కులు కొని 'ఆట ఆరంభం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు ఓమిక్స్ క్రియేషన్స్ అధినేత డా.శీనుబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుక్ను ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అజిత్, ఆర్య నటన, నయనతార, తాప్సీ గ్లామర్, విష్ణువర్థన్ టేకింగ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు. ఈ నెల మూడో వారంలో ఆడియోను, నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఫొటోగ్రఫీ: ఓంప్రకాశ్, నిర్మాత: డా.శ్రీనుబాబు జి., దర్శకత్వం: విష్ణువర్థన్.

English summary
Now, the latest movie to be in focus is Ajith's Arrambam. This Diwali release has gone on to generate good income for all stakeholders and there are talks that Akshay Kumar has expressed an interest to remake the movie in Hindi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu