»   »  అజిత్ 'వేదలం' తెలుగు టైటిల్ ఖరారు

అజిత్ 'వేదలం' తెలుగు టైటిల్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌, శ్రుతిహాసన్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం 'వేదలం' . ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే రోజు విడుదల చేయనున్నారు. తెలుగు టైటిల్ గా ... ‘ఆవేశం' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

'వేదలం' కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తన కెరీర్‌లో తొలిసారిగా అజిత్‌తో కలసి వర్క్ చేస్తుండటంతో అనిరుధ్ తెగ సంబరపడిపోతున్నాడట.

ఎ.ఎం. రత్నం నిర్మాణ సారధ్యంలో శివ డైరెక్ట్ చేస్తున్న అజిత్ 56వ సినిమాగా వస్తోన్న వేదాలమ్ రైట్స్ కోసం బయర్లు విపరీతంగా పోటీ పడుతున్నారు. టీజర్‌ను రీసెంట్ గా చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఓ రేంజిలో రెస్వాన్స్ వచ్చింది.

Ajith’s Vedalam gets its Telugu title

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక వేదాలం అంటే ఘోస్ట్ అని అర్థం. సో నెగెటీవ్ లుక్ ఉన్న హీరోగా ఈ సినిమాలో అజిత్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.... ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఏవీ బయటకు రాకపోవడంతో.. అజిత్ ఈ చిత్రంలో ఎలా ఉండబోతున్నాడనే ఉత్సుకత నెలకొంది... టైటిల్ తో పాటు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రెడ్ కలర్ కుర్తా, షార్ట్ ట్రిమ్ముడ్ హెయిర్... మెడలోనూ, చేతికి మెటల్ చైన్, చెవికి రింగ్, వేళ్లనిండా ఉంగరాలతో పక్కా మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు అజిత్.

అయితే ఈ గెటప్ చూసినవారు దాదాపు పదమూడేళ్ల క్రితం అజిత్ నటించిన రెడ్ సినిమాలోని గెటప్ ను పోలి ఉందంటున్నారు.... ఇటీవల అజిత్ చిత్రాలన్నీ తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా తెలుగులో డబ్ కానుంది. గతంలో అజిత్-శివ కాంబినేషన్ లో వచ్చిన వీరమ్ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి నవంబర్-10న వస్తున్న వేదాలం.. ఆ అంచనాలను అందుకుని అజిత్ కు మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

English summary
Tamil star Thala Ajith’s Vedalam, will be dubbed into Telugu as Aavesham. As per the ongoing buzz, Aavesham will be released on the 10th of November along with its Tamil version.
Please Wait while comments are loading...