For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఖిల్ సినిమాకు షాకింగ్ బిజినెస్: ఒక్క హిట్ లేకున్నా అన్ని కోట్లా? హిట్ అవ్వాలంటే అంత రావాల్సిందే!

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది బడా స్టార్ల వారసులు హీరోలుగా పరిచయం అవుతున్నారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే అద్భుతమైన టాలెంట్లను చూపించుకుంటూ స్టార్లుగా ఎదిగిపోయారు. మిగిలిన వాళ్లంతా పలు కారణాలతో సక్సెస్‌ కాలేకపోయారు. అయితే, ఒకరు మాత్రం హ్యాండ్సమ్ లుక్స్, యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉన్నా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్. ఈ క్రమంలోనే ఇప్పుడు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక్క హిట్ లేకున్నా ఈ మూవీకి బిజినెస్ భారీగా జరిగింది. ఆ లెక్కలను పరిశీలిద్దాం పదండి!

   ‘బ్యాచ్‌లర్'గా వస్తున్న అక్కినేని అఖిల్

  ‘బ్యాచ్‌లర్'గా వస్తున్న అక్కినేని అఖిల్

  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రమే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  Monal Gajjar ఇన్‌స్టా నుంచి పిచ్చి పిచ్చి ఫొటోలు: అనుమానాలు మొదలు.. షాకింగ్ న్యూస్ చెప్పిన అఖిల్

  వరుస ఆటంకాలు... రీషూట్స్.. ఇబ్బంది

  వరుస ఆటంకాలు... రీషూట్స్.. ఇబ్బంది

  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. కానీ, కరోనా రెండు లాక్‌డౌన్ల కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికి తోడు కొన్ని రీషూట్ల వల్ల ఇది మరింత లేట్ అయింది. అయినప్పటికీ ఔట్‌పుట్ మాత్రం అదిరిపోయేలా వచ్చిందని అంటున్నారు.

  అంచనాలు భారీగానే.. వాటికి తగ్గట్లుగానే

  అంచనాలు భారీగానే.. వాటికి తగ్గట్లుగానే


  రొమాంటిక్ ఫీల్ గుడ్ జోనర్‌లో అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులోని ‘లెహరాయీ' సాంగ్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, టీజర్, ట్రైలర్‌ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

  స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

  తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ అంటూ

  తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ అంటూ

  అక్కినేని అఖిల్ ఇప్పటి వరకూ హీరోగా మూడు సినిమాలు చేశాడు. అవేమీ ప్రేక్షకుల మన్ననలు అందుకోలేదు. అయినప్పటికీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. దీనికి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 9 కోట్ల బిజినెస్ జరిగిందట. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.50 కోట్లు వ్యాపారం జరిగినట్లు టాక్.

  ప్రపంచ వ్యాప్తంగా ఎంత జరిగిందంటే?

  ప్రపంచ వ్యాప్తంగా ఎంత జరిగిందంటే?

  తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా రూ. 17.50 కోట్ల వ్యాపారం జరుపుకున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి దీనికి రూ. కోటి బిజినెస్ జరిగిందట. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  MAA Elections: జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో CM అవ్వలేదా.. క‌ళ‌కు ప్రాంత‌మేంటి ? Jeevitha
  అన్ని కోట్లు వస్తేనే హిట్ అయినట్లు లెక్క

  అన్ని కోట్లు వస్తేనే హిట్ అయినట్లు లెక్క

  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకోవాలంటే మాత్రం రూ. 19 కోట్లు వసూలు చేయాల్సిందేనని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దసరా సీజన్‌లో విడుదల కాబోతుండడంతో దీనికి కలిసొచ్చే అంశం. మరి తీవ్ర పోటీ మధ్య ఇది ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

  English summary
  Tollywood Young Hero Akhil Akkineni Did Most Eligible Bachelor Under Bommarillu Bhaskar. Now This Movie World Wide Business Details Revealed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X