»   » ‘అఖిల్’ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్

‘అఖిల్’ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అవుతున్న అఖిల్ అక్కినేని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖిల్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుండి గతంలో చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే వారెవ్వరికి అఖిల్ రేంజిలో హైప్ రాలేదు. గతంలో నాగ చైతన్య పరిచయం అయిన సమయంలో కూడా ఇంత హైప్ లేదు. కానీ అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా విషయంలో మాత్రం క్రేజ్ భారీగా ఉంది.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండటం, స్వయంగా యంగ్ హీరో నితిన్ ఈచిత్రాన్ని నిర్మిస్తుండటం కూడా సినిమాపై హైప్ పెరగడానికి మరో కారణం. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి.

Akhil movie recordbreaking pre-release business

మరో వైపు ‘అఖిల్' సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వివిధ ఏరియాల్లో కలిపి మొత్తం రూ. 45 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఎంటైర్ ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ. 17 కోట్లకు, నైజాం ఏరియాలో రూ. 14 కోట్లకు, సీడెడ్ ఏరియాలో 6 కోట్లకు... టోటల్ రూ. 37 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం.

దీంతో పాటు కర్ణాటకలో రూ. 4 కోట్లకు, రెస్టాఫ్ ఇండియా రూ. 50 లక్షల నుండి 1 వరకు అమ్ముడు పోయిందని అంటున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం రూ. 3.5 కోట్ల నుండి 4 కోట్లకు అమ్మడయినట్లు చెబుతున్నారు. ఇక శాటిలైట్స్ రైట్స్ రూ. 7 నుండి 8 కోట్లకు తక్కువ కాకుండా వస్తాయని ఆశిస్తున్నారు. ఇలా ఓవరాల్ గా ఈ చిత్రం రూ. 53 కోట్లకు చేరింది. తెరంగ్రేటం చేస్తున్న హీరో సినిమాకు ఈ రేంజిలో బిజినెస్ జరుగడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

అసలు ఇంత వరకు అక్కినేని ఫ్యామిలీలో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన సినిమా ‘మనం'. ఈ చిత్రం 40 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఈ రికార్డును కూడా అఖిల్ అక్కినేని బద్దలు కొట్టడం గమనార్హం. మరి సినిమా విడుదలకు ముందే పరిస్థితి ఇలా ఉందంటే... అఖిల్ సినిమా విడుదల తర్వాత ఎలా ఉంటుందో?

English summary
Akhil's recordbreaking pre-release business. As per the insider's buzz, the producers have already sold the film off for a whopping 45 crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu