ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్న నాని, అఖిల్.. ఎంసీఏ, హలో కలెక్షన్లు ఇవే..

By Rajababu

క్రిస్మస్ సెలవులను, న్యూ ఇయర్ మూడ్‌ను క్యాష్ చేసుకోవడానికి వచ్చిన నేచురల్ స్టార్ నానీ, అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని ఓవర్సీస్ మార్కెట్‌లో దుమ్మురేపుతున్నారు. నాని, అఖిల్ చిత్రాలకు మంచి స్పందన రావడం విశేషం. డిసెంబర్ 21న రిలీజైన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి), 22న విడుదలనైన హలో చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ రెండు చిత్రాలు అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలలో మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి.

ఆస్ట్రేలియా బాక్సాఫీస్‌లో

ఎంసీఏ చిత్రం ఆస్ట్రేలియాలో అనూహ్యమైన కలెక్షన్లను సాధించింది. ఆస్ట్రేలియా బాక్సాఫీస్‌ చార్ట్‌లో 12వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా బాక్సాఫీస్‌లో తెలుగు సినిమాకు ఈ చోటు దక్కడం విశేషం. మంగళవారం ఈ చిత్రం 31,114 ఆస్ట్రేలియా డాలర్లు అంటే సుమారు 15.47 లక్షలు వసూలు చేసింది. ఎంసీఏ కలెక్షన్ల వివరాలను ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

 ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లు

ఎంసీఏ రిలీజైన రోజే కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 11 కోట్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. వారాంతంలో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

 అక్యుపెన్సీ రేషియో

అక్యుపెన్సీ రేషియో

ఎంసీఏ చిత్రానికి గురు, శుక్రవారాల్లో 70 శాతం అక్యుపెన్సీ కనిపించింది. వారాంతంలో అక్యుపెన్సీ రేషియో పెరిగి మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

ఎంసీఏ చిత్రం నైజాంలో 3 కోట్లు, సీడెడ్‌లో 1.10 కోట్లు, యూఏ 1 కోటి, గుంటూరులో 70 లక్షలు, తూర్పు గోదావరి 60 లక్షలు, పశ్చిమ గోదావరి 50 లక్షలు, కృష్ణా జిల్లాలో 50 లక్షల వసూళ్లను సాధించాయి.

అమెరికాలో హలో కలెక్షన్లు

అమెరికాలో హలో కలెక్షన్లు

ఇక శుక్రవారం విడుదలైన హలో చిత్రం అమెరికాలో మంచి వసూళ్లను సాధించాయి. యూఎస్‌లో 133 లోకేషన్లలో 1.87 లక్షల డాలర్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని కలెక్షన్లు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

 నాని, అఖిల్ ఫ్రెండ్లీ పోటీ

నాని, అఖిల్ ఫ్రెండ్లీ పోటీ

కాగా, ఒక రోజు వ్యవధిలో నాని, అఖిల్ చిత్రాలు విడుదల కావడంపై కొంత చర్చ జరిగింది. అయితే నాని గానీ, అక్కినేని నాగార్జున గానీ, అఖిల్ గానీ ఫ్రెండ్లీ పోటీగా ఉంటుందని చెప్పారు. ఎంసీఏ, హలో చిత్రాలు విజయం సాధించాలి అని వారు కోరుకున్నారు.

సోషల్ మీడియాలో ట్రెండింగ్

సోషల్ మీడియాలో ట్రెండింగ్

ఈ నేపథ్యంలో శుక్రవారం నాని, అఖిల్ కలిసి తీసుకొన్న ఫొటోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది అని చెప్పడానికి అఖిల్, నాని చేసిన ప్రయత్నాన్ని సినీ వర్గాలు హర్షిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X