Just In
- 3 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 4 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 5 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఓవర్సీస్‌లో దూసుకుపోతోన్న ‘అల’.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆ ఫీట్ అందుకున్న బన్నీ
ఓవర్సీస్ మార్కెట్‌లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ దూసుకుపోతోన్నాడు. రిలీజైన వారంలోపే రెండు మిలియన్ల మార్క్‌ను క్రాస్ చేసి సత్తాచాటాడు. జనవరి 12న బాక్సాఫీస్ బరిలో దిగిన అల వైకుంఠపురములో అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. విడుదలైన రోజు నుంచి రికార్డుల వేటను కొనసాగిస్తోంది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో మొదలెట్టిన రికార్డుల పరంపర నేటికీ ఆగడం లేదు.

సంగీతంతో హైప్..
అల వైకుంఠపురములో విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేసింది. ఈ మూవీ నుంచి ఒక్కో పాటను విడుదల చేస్తూ ఉంటే సోషల్ మీడియా షేక్ అయింది. యూట్యూబ్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. సామజవరగమన, రాములో రాముల, ఓమైగాడ్ డాడీ, బుట్టబొమ్మ ఇలా ప్రతీ పాట ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఆల్బమ్ ఈ రేంజ్‌లో వర్కౌట్ కావడంతో సినిమాపైనా అందరికీ ఓ నమ్మకం ఏర్పడింది.

త్రివిక్రమ్-బన్నీ మ్యాజిక్..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిస్తే ఓ మ్యాజిక్ క్రియేట్ అవుతుందని అందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలే అందుకు నిదర్శనం. అయితే హ్యాట్రిక్ కొట్టేందుకు అల వైకుంఠపురములో చిత్రంతో రాగా.. అది సూపర్ డూపర్ హిట్ అయింది. మరోసారి వీరి కాంబినేషన్‌లో అదిరిపోయే సినిమా రావడంతో అభిమానులతో పాటు, బాక్సాఫీస్ కూడా ఖుషీ అవుతోంది.

రికార్డుల పరంపర..
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తిరుగులేని రికార్డులను క్రియేట్ చేస్తోంది. అల్లు అర్జున్ కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్ల సాధిస్తోన్న సినిమాగా అల సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల నాన్ బాహుబలి రికార్డులను నమోదు చేస్తోంది. నైజాం, ఈస్ట్, సీడెడ్, నెల్లూరు ఇలా ఏడు చోట్ల నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది.

ఓవర్సీస్‌లోనూ అదే జోరు..
ఓవర్సీస్ మార్కెట్‌లో మాస్ చిత్రాల కంటే క్లాస్ సినిమాలకు కాసుల వర్షం కురుస్తుందని మరోసారి నిరూపితమైంది. ఎందకుంటే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం అల కంటే ఒక రోజు ముందు విడుదలైనా.. కలెక్షన్లలో మాత్రం బన్నీ సినిమానే ముందంజలో ఉంది. సరిలేరు, దర్బార్ చిత్రాల కంటే అల వైకుంఠపురములోనే ఎక్కువ వసూళ్లు చేస్తోందని తెలుస్తోంది.

రెండు మిలియన్ల మార్క్‌ను..
ప్రీమియర్స్, మొదటి రోజు కలెక్షన్లతో మిలియన్ మార్క్‌ను సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. విడుదలైన ఆరు రోజుల్లోనే రెండు మిలియన్ల మార్క్‌ను చేరుకోవడం విశేషమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పైగా అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఈ మార్క్‌ను అందుకోవడం మొదటి సారి. అయితే పూర్తి రన్‌లో ఈ చిత్రం ఇంకెంత కొల్లగొడుతుందో అని లెక్కలేస్తున్నారు.