twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కడ అల వైకుంఠపురములో టాప్.. రజినీ, మహేష్ ఇలా అందర్నీ వెనక్కి నెట్టేసిన బన్నీ

    |

    మన భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మనవాళ్లున్న అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అరబ్ దేశాలు ఇలా కొన్ని ప్రాంతాల్లో మన సినిమాలకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. లోకల్ కలెక్షన్నీ ఓ లెక్క అయితే.. ఓవర్సీస్ వసూళ్లు మరో లెక్క. ఈ మధ్య కాలంలో ఓవర్సీస్ లెక్కలను పరిగణలోకి తీసుకుని హిట్టా ఫట్టా అని చెబుతున్నారు. ఒక్కప్పుడు మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరితే గొప్ప విషయంగా చెప్పుకునేవారు.

    ఇంకా ఆ ఫీట్ సాధించని వారెందరో..

    ఇంకా ఆ ఫీట్ సాధించని వారెందరో..

    మన హీరోల్లో ఇంకా మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరని వారెందరో ఉన్నారు. అయితే ఒకప్పుడు మిలియన్ డాలర్లను చేరుకోవడమే కష్టంగా ఉంటే.. కేవలం ప్రీమియర్లతోనే ఈ ఫీట్‌ను అవలీలగా క్రాస్ చేసేస్తున్నారు. కేవలం ఒక్క రోజులో మిలియన్ డాలర్లను వసూళ్లు చేసి అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నారు.

    అక్కడ దూసుకుపోతోన్న సరిలేరు, అల

    తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు ఓవర్సీస్‌లోనూ దుమ్ములేపుతున్నాయి. ఈ కమ్రంలో అక్కడి రిపోర్ట్స్ అందర్నీ షాక్‌కు గురి చేశాయి. యూఎస్ బాక్సాఫీస్ వద్ద టాప్ 10గా నిలిచిన అంతర్జాతీయ సినిమాల లిస్ట్ తీస్తే.. అందులో సగం దాదాపు ఇండియన్ సినిమాలే ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

    టాప్‌లో నిలిచిన తెలుగు సినిమా..

    టాప్‌లో నిలిచిన తెలుగు సినిమా..

    అయితే అందులోనూ మన తెలుగు సినిమాలు టాప్ ప్లేస్‌లో నిలిచాయి. అల వైకుంఠపురములో అన్ని చిత్రాలకంటే ముందజలో నిలబడి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక సరిలేరు చిత్రం నాల్గో స్థానానికి పరిమితం కాగా, రజినీ దర్బార్, అజయ్ దేవగణ్ తానాజీ, దీపికా చపాక్ సినిమాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.

    Recommended Video

    Allu Arjun's Satire On Fake Collections ?
    తక్కువ లొకేషన్లు, తక్కువ ధరకు..

    తక్కువ లొకేషన్లు, తక్కువ ధరకు..

    అల వైకుంఠపురములో సినిమాను తక్కువ లొకేషన్లలో విడుదల చేసినా.. సరిలేరు టికెట్ ధర కంటే తక్కువ మొత్తాన్ని ఫిక్స్ చేసిన ఒక్క రోజులోనే మిలియన్ క్లబ్‌లోకి చేరడం విశేషం. రేసుగుర్రం ఫుల్ టైమ్‌లో 1.4మిలియన్ డాలర్లను వసూళ్లు చేయగా.. ఆ రికార్డును అల వైకుంఠపురములో ఒక్క రోజులోనే చేరిపేసింది. దీన్ని బట్టే తెలుస్తోంది.. అల వైకుంఠపురములో ఏ రేంజ్‌లో దూసుకుపోతోందని.

    English summary
    Ala Vaikunthapurramuloo Is At Top In Us Weekend Box Office. 5 Indian films in the list of Specialized Top 10 USA Weekend Box Office Actuals this week. A Rare achievement. More Power to IndianCinema ! 3 from South Chart-topper also a South Film #AlaVaikunthapurramuloo
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X