Just In
- 28 min ago
జాతిరత్నాలు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. నిన్న ప్రభాస్ ఇప్పుడు మరో హీరో.. షాకిచ్చేలా ఉన్నారు!
- 55 min ago
అన్ని భాషల్లోకి వెళ్లనున్న ప్లే బ్యాక్.. రియల్ సక్సెస్ అంటే ఇదే!
- 1 hr ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 1 hr ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
Don't Miss!
- Sports
India vs England: సునీల్ గవాస్కర్ హాఫ్ సెంచరీ.. సత్కరించిన బీసీసీఐ!!
- Automobiles
భారతదేశంలో మొట్టమొదటి స్ట్రీట్ లైట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఇదే.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Finance
దిగొస్తోన్న సోనా.. ఆగస్ట్‌లో 50 వేల పైచిలుకు.. మార్చిలో 43 వేలు
- News
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేది
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల.. వైకుంఠపురములో 22 డేస్ కలెక్షన్ రిపోర్ట్: బన్నీ బ్రేకుల్లేని సునామీ
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'అల.. వైకుంఠపురములో' నేటికీ విజయవంతంగా ఆడుతోంది. విడుదలై 22 రోజులు గడిచినా అన్ని సెంటర్లలో డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తూ లాభాల పంట పండిస్తూనే ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఎంత రాబట్టిందో ఓ సారి డీటెయిల్‌గా చూద్దామా..

విజయవంతం అవుతున్న 4వ వారం
4వ వారం లోనూ 'అల.. వైకుంఠపురములో' హంగామా కనిపిస్తోంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చి.. తొలి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ నేటికీ వసూళ్ల ప్రవాహం పారిస్తోంది. 22వ రోజు 'అల.. వైకుంఠపురములో' సినిమా దాదాపు 35 లక్షల రూపాయలు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియావైజ్ 22 డేస్ డీటెయిల్ రిపోర్ట్
‘అల వైకుంఠపురములో' మూవీ కలెక్షన్స్ వివరాలు ఏరియావైజ్‌గా చూసినట్లయితే..
నైజాం - 42.70 కోట్లు
సీడెడ్ - 18.10 కోట్లు
గుంటూరు - 10.05 కోట్లు
ఉత్తరాంధ్ర - 20.02 కోట్లు
తూర్పు గోదావరి - 11.1 కోట్లు
పశ్చిమ గోదావరి - 8.5 కోట్లు
కృష్ణా - 10.25 కోట్లు
నెల్లూరు - 4.3 కోట్లు
AP/TG 22 డేస్ టోటల్ షేర్ - 125.67 కోట్లు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే..
కర్ణాటక: 8.96 కోట్లు
ROI: 3.36 కోట్లు
అమెరికా: 18.02 కోట్లు
టోటల్ 22 డేస్ వరల్డ్ వైడ్ షేర్: 155.99 కోట్లు

ఓవర్సీస్‌లోనూ మాయాజాలం
ఓవర్సీస్‌లో మాటల మాంత్రికుడు మాయాజాలం పనిచేసింది. నాన్ బాహుబలి పేరిట ఉన్న రంగస్థలం రికార్డులను బన్నీ చెరిపేశాడు. 'రంగస్థలం' లాంగ్ రన్‌లో 3.52 మిలియన్ డాలర్లను కొల్లగొడితే.. వాటిని బ్రేక్ చేసేసింది. బన్నీ ప్రస్తుతం నాలుగు మిలియన్ల డాలర్ల వైపు పరిగెడుతున్నాడు.

‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ బిజినెస్
‘అల వైకుంఠపురములో' చిత్రానికి 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఈ మార్క్ దాటేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఈ మూవీ. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటించగా.. సుశాంత్, నివేతా పేతురాజ్, మురళి శర్మ, జయరాం, సచిన్, టబు కీలక పాత్రలు పోషించారు.

అల.. సక్సెస్ పార్టీ
250కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టిన అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ రేంజ్ సక్సెస్ సాధించిన చిత్రానికి సక్సెస్ పార్టీ కూడా అంతే రేంజ్‌లో నిర్వహించారు యూనిట్ సభ్యులు. ఈ వేడుకకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మొదలుకుని.. పరుశురామ్, మారుతి సహా పలువురు డైరెక్టర్లు హాజరు కావడం విశేషం.